Health Benefits : గోధుమ గడ్డి జ్యూస్ తో మధుమేహంతో పాటుగా ఆ వ్యాధి కూడా పరుగో పరుగు
Health Benefits: డయాబెటిస్ ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడా వణికిస్తున్న జబ్బు. ఒక్కసారి డయాబెటిస్ వచ్చిందంటే చాలు ఇక పత్యం చేయలేక పలువురు సతమతమవుతున్నారు. అంతలా పత్యం చేయాలి. ఈ జబ్బు వస్తే. మనకు తినాలనిపించినా కానీ ఎవరైనా తినమన్నా కానీ ఏది పడితే అది తినడానికి ఉండదు. కావున డయాబెటీస్ అటాక్ కాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఈ వ్యాధి అటాక్ అయిందంటే ఇక లైఫ్ లాంగ్ సఫర్ కావాల్సిందే. కాబట్టే డయాబెటిస్ రాకుండా చాలా మంది ముందు నుంచే చాలా పద్ధతిగా ఆహారం తింటున్నారు.
కొంత మంది ఎంత పద్ధతిగా ఉంటున్నా కానీ డయాబెటిస్ అటాక్ అవుతోంది. అలాంటి వారు ఓరి దేవుడో అనుకుంటూ కఠిన పత్యాన్ని చేస్తున్నారు.డయాబెటిస్ అటాక్ అయిన వారు ఏది తిన్నా చాలా నియమనిబంధనలతో తినాలని నిపుణులు చెబుతున్నారు. ఏ పదార్థం కూడా ఎక్కువ మోతాదులో తినకూడదు. డయాబెటిస్ వచ్చిన వారు గోధుమ గడ్డి రసాన్ని తాగడం వలన చాలా ప్రయోజనం కలుగుతుందని పలువురు వైద్యులు చెబుతున్నారు. ఈ గోధుమగడ్డి రసంలో అనేక లవణాలు, ప్రొటీన్లు ఉంటాయని చెబుతున్నారు. గోధుమ గడ్డి రసంలో ప్రొటీన్స్, ప్లేవనాయిడ్స్, విటమిన్ సీ వంటి అనేక పోషకాలు ఉంటాయి.
Health Benefits : ఈ ఆకు తింటే డయాబెటిస్ కు చుక్కలే..
కావున ఇది తీసుకోవడం వలన షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా బెటర్ గా ఉంటుంది. ఇక షుగర్ వ్యాధి గ్రస్తులకు అతి పెద్ద శత్రువు చెక్కర. మన ఇంట్లో ఉండే చెక్కరతో పాటుగా ఒంట్లో ఉండే చెక్కర కూడా వీరికి శత్రువే. కావున వీరు ఏ ఆహారం తీసుకున్న చెక్కర లెవెల్స్ తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని చెబుతారు. గోధుమ గడ్డి జ్యూస్ లో చెక్కర లెవెల్స్ చాలా కంట్రోల్ లో ఉంటాయి. ఇది మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది తాగడం వలన కేవలం మధుమేహం తగ్గడం మాత్రమే కాకుండా స్థూలకాయం సమస్య కూడా ఇట్టే తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు.