Stevia Leaves : చక్కెర బదులు స్టీవియా తీసుకుంటే ఎన్ని లాభాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Stevia Leaves : చక్కెర బదులు స్టీవియా తీసుకుంటే ఎన్ని లాభాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు…!

Stevia Leaves : మనమంతా ఆరోగ్యంగా ఉండాలని ఆహారం తీసుకుంటూ ఉంటాం. అయితే మనం తినే అన్ని ఆహారాలు మనకు ఆరోగ్యాన్ని ఇవ్వవు.. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఎంతో రుచికరమైన పదార్థాలే మనపై ఎంతో చెడు ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో పంచదార ఒకటి. అందుకే పంచదారకు బదులుగా తీపిని అందించే ప్రత్యయం తయారు చేసుకుంటున్నాం.. అలాంటి వాటిలో ఒకటి స్టీవియా అనేది చెట్టు ఆకులు నుండి తయారవుతుంది. ఇది మరి చెక్కరకు […]

 Authored By jyothi | The Telugu News | Updated on :8 January 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Stevia Leaves : చక్కెర బదులు స్టీవియా తీసుకుంటే ఎన్ని లాభాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు...!

Stevia Leaves : మనమంతా ఆరోగ్యంగా ఉండాలని ఆహారం తీసుకుంటూ ఉంటాం. అయితే మనం తినే అన్ని ఆహారాలు మనకు ఆరోగ్యాన్ని ఇవ్వవు.. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఎంతో రుచికరమైన పదార్థాలే మనపై ఎంతో చెడు ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో పంచదార ఒకటి. అందుకే పంచదారకు బదులుగా తీపిని అందించే ప్రత్యయం తయారు చేసుకుంటున్నాం.. అలాంటి వాటిలో ఒకటి స్టీవియా అనేది చెట్టు ఆకులు నుండి తయారవుతుంది. ఇది మరి చెక్కరకు బదులుగా దీనిని వాడవచ్చా.. దీని వలన ఆరోగ్యానికి ఏమైనా హాని ఉంటుందా.. ఈ అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం తినే పండ్లు, కూరగాయలు, పాల పదార్థాలలో సైతం సహజమైన సుగర్ ఉంటాయి. అయితే ఇవి అంతగా హాని చేయవు. కానీ చక్కెరతో తయారైన పదార్థాలు పానీయాలు మాత్రం మన ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా అధిక బరువు, మధుమేహం, రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు పంచదారను వాడటం ఏమాత్రం మంచిది కాదు.. అందుకే చక్కెరకు ప్రత్యామ్నాయంగా వాడదగినవి మనకు అందుబాటులోకి వస్తున్నాయి.

అలాంటి వాటిలో స్టివియ ఒకటి. స్టీవియా అనే చెట్టు ఆకుల నుంచి తయారు అయ్యే కృత్రిమ పంచదార ఇది. సాధారణ చక్కెర కంటే వంద నుంచి 300 రెట్లు ఎక్కువ తీపిని కలిగి ఉంటుంది. కానీ ఇందులో పిండి పదార్థాలు, క్యాలరీలు, కృత్రిమమైన అంశాలు ఏమీ ఉండవు. వీటిని పంచదార గానే ఆహారాల్లో వాడవచ్చు.. అయితే ఒక్కో బ్రాండ్ స్టీవియా ఉత్పత్తిలో తీపిదనం ఒక్కో స్థాయిలో ఉంటుంది. కనుక దాన్ని తీపిస్తాయి ఎలా ఉంటుందనేది ప్యాకెట్ పైన ఉన్న వివరాలను చూసి తెలుసుకుని వాడాలి. చక్కెర బదులు స్టీవియా తీసుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయి. మరి దాని గురించి తెలుసుకుందాం.. పంచదార తీసుకుంటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయని అనుకుంటారు. అయితే కేవలం చక్కర మాత్రమే కాదు.. బెల్లం, ఎండు ద్రాక్ష, తేనా వంటివి కూడా ప్రమాదమే.. అందుకే సహజ మొక్కలను తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. పంచదార బదులు స్టీవియా వాడితే ఇందులో కేలరీస్ కార్బోహైడ్రేట్స్ ఉండవు. కాబట్టి షుగర్ ఉన్నవారు టీ కాఫీలో స్టీవియా తీసుకోవచ్చు. వీటిని తీసుకున్నప్పుడు రక్తంలో గ్లూకోస్ తగ్గి పెరగకుండా స్థిరంగా ఉంటాయి.

కాబట్టి హ్యాపీగా దీన్ని తీసుకోవచ్చు. దీనివల్ల క్యాన్సర్ ప్రమాదం 23% తగ్గుతుంది. అందుకే స్వీట్నెస్ బదులు స్టీవియా తీసుకుంటే క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. డైట్ చేయాలనుకునే వారు ముందుగా పంచదార మానేస్తారు. దాని బదులు స్టీవియా తీసుకోవచ్చు. దీనిలో కేలరీస్ ఉండవు. కాబట్టి బరువు తగ్గడంలో కూడా హెల్ప్ చేస్తుంది. దీని వల్ల రక్తంలోని అదనపు సోడియం మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోతుంది. బీపీ కంట్రోల్ అవుతుంది. దీనివల్ల క్యాన్సర్ గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది. జనక్రియ మెరుగ్గా అవుతుంది. కాబట్టి వీటిని హ్యాపీగా తీసుకోవచ్చు. వీటిని తింటే స్వీట్ క్రేవింగ్స్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. దీనిని కూడా మోతాదులోనే తీసుకోవాలి. లేకపోతే కిడ్నీ సమస్యలు పెరుగుతాయి. కాబట్టి తీసుకునే ముందు డాక్టర్ సలహాలు తీసుకోవడం మంచిది…

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది