Health Benefits : వేడి నీటిని తీసుకోవడం వలన ఎన్నో వ్యాధులకు చెక్ పెట్టవచ్చు…
Health Benefits : ప్రస్తుతం మనం ఉన్న కాలంలో చాలామందిలో ఎక్కువగా ఉండే వ్యాధులు గుండె జబ్బులు, డయాబెటిక్, షుగర్, ఇంకా ఇలాంటి ఎన్నో జబ్బులతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి జబ్బులతో ఎంతోమంది ఆకస్మాత్తుగా చనిపోతూ ఉంటారు. అయితే అసలు ఈ జబ్బులను ఎందుకు వస్తాయి. ఎందుకనగా మనం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు వలన, సరైన వ్యాయామం లేక ,ఇలాంటి జబ్బులన్నీ వస్తూ ఉంటాయి. ఇవి పాటించనప్పుడు గుండెకు కొవ్వు పెరిగి రక్త ప్రసరణ ఆగిపోతుంది. దాని వలన గుండె నొప్పి వస్తుంది. ఒక్కొక్క టైంలో సడన్ గా గుండె ఆగిపోతుంది. అలాగే షుగర్ ,బిపి ఇలాంటి ఎన్నో జబ్బులతో బాధపడుతూ ఉంటారు.
ఈ వ్యాధులన్నిటికీ చెక్ పెట్టాలి. అంటే ప్రతిరోజు ఉదయం రెండు గ్లాసుల వేడి నీరు తాగుతూ ఉండాలి ఇలా త్రాగడం వలన మన శరీరంలోని కొన్ని అవయవాలు పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. వేడి నీరు త్రాగడం వలన ,మన శరీరంలో మెట్బాలిజం కూడా ఉత్పత్తి అవుతుంది. అలాగే వర్షాకాలంలో వచ్చే జలుబులు, దగ్గు, ఆస్తమా ,అలర్జీలు ఇలాంటివి ఎన్నో కూడా వస్తుంటాయి. ఇలాంటి సమయంలో కూడా ఇలా వేడి నీరును ప్రతిరోజు తీసుకోవడం వలన ఎంతో ఉపశమనం కలుగుతుంది. అయితే సమ్మర్ టైంలో మాత్రం వేడి నీటిని త్రాగవద్దు. ఈ టైంలో మన శరీరంలోని వేడి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో వేడి నీటిని తీసుకోవడం వలన ఉత్పత్తి ఆగిపోతుంది.
అలాగే అధిక బరువు ఉన్నవాళ్లు మాత్రం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూను తేనె ,లేదా ఒక స్పూను నిమ్మ రసం కలుపుకుని త్రాగడం శరీరంలో ఉన్న కొవ్వు కరిగితుంది. 100% బరువు తగ్గుతారు. అలాగే మలబద్దక సమస్య ఉన్నవాళ్లు కూడా ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీటిని లీటర్ నీళ్లను తీసుకుంటూ ఉండాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో పెద్దప్రేగు లో ఉండే మలాన్ని వేడి నీరు కదిలిస్తుంది. అలా కదలడం వలన ఫ్రీ మోషన్ కూడా అవుతుంది. అలాగే జీర్ణ సంబంధిత వ్యాధులు కూడా తగ్గిపోయి జీర్ణ వ్యవస్థ హైడ్రేట్ అవుతుంది. ఈలాంటి ఎన్నో వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. ప్రతిరోజు వేడి నీటిని తీసుకోవడం వలన ఎన్నో మంచి ప్రయోజనాలు ఉన్నాయి.