High BP : హైబీపీ రాకుండా 5 అద్భుతమైన ఆయుర్వేద మూలిక‌లు… ఎలా వాడాలంటే..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

High BP : హైబీపీ రాకుండా 5 అద్భుతమైన ఆయుర్వేద మూలిక‌లు… ఎలా వాడాలంటే..?

 Authored By kondalrao | The Telugu News | Updated on :25 June 2021,3:25 pm

High Bp : రక్త పోటు (బ్లడ్ ప్రెజర్-బీపీ) 120/80 అంటే అది నార్మల్ అన్నట్లు. అంతకన్నా ఎక్కువ ఉంటే హైబీపీ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రక్తపోటు కంట్రోల్లో లేకుంటే ఇతరత్రా జబ్బులు కూడా అదుపులోకి రావు. అందుకని బీపీ పెరగకుండా చూసుకోవటానికి ఆయుర్వేదంలో అందుబాటులో ఉన్న ఐదు మంచి మూలికల గురించి తెలుసుకుందాం. ఈ రోజుల్లో చాలా మంది హైబీపీతో ఇబ్బంది పడుతున్నారు. లైఫ్ స్టైల్లో మార్పు కావొచ్చు. ఆహారపు అలవాట్లలో తేడాలు కావొచ్చు. ప్రస్తుతం 40 ఏళ్లు దాటిందంటే చాలు. బీపీ, షుగర్ తదితర ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ వయసువాళ్లందరూ ఈ ఐదు మూలికలపై ఫోకస్ పెట్టడం బెటర్. అవి..

health benifits high bp use By Ayurvedic products

health benifits high bp use By Ayurvedic products

అశ్వగంధ :

అశ్వగంధ పొడిని లేదా ట్యాబ్లెట్లను రోజూ రెండు పూటలు (ఉదయం, సాయంత్రం) వాడితే సరిపోతుంది. బీపీ దానంటత అదే సాధారణ స్థితికి వస్తుంది. పౌడర్ ని గోరు వెచ్చని నీటిలో కలుపుకొని పొద్దున్నే పరిగడుపునే తాగాలి. ట్యాబ్లెట్లు రెండు (250, 500 మిల్లీ గ్రాములు) డోసుల్లో లభిస్తున్నాయి. ముందుగా తక్కువ డోస్ తో మొదలుపెట్టడం మంచిది. ఈ గోళీలతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అయినా డాక్టర్ సలహాలు సూచనల ప్రకారం వేసుకోవటం ఉత్తమం.

health benifits high bp use By Ayurvedic products

health benifits high bp use By Ayurvedic products

తులసి : High Bp

తులసి ఆకులను లేదా తేనీటిని లేదా ట్యాబ్లెట్లను ప్రతి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు వేసుకోవాలి. తులసిలో యుజినాల్ అనే కెమికల్ ఉంటుంది. అది రక్త పోటును తగ్గిస్తుంది. శ్వాస సంబంధ ఇబ్బందులనూ దూరం చేస్తుంది. తులసి మొక్కకు ఆధ్యాత్మికపరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకే ఉదయాన్నే చాలా మంది ఆ మొక్కకు పూజ చేస్తుంటారనే సంగతి తెలిసిందే.

ఉసిరి :

ఉసిరి.. కాయ, రసం, పొడి, ట్యాబ్లెట్ల రూపంలో దొరుకుతుంది. రోజూ తెల్లవారుజామున్నే ఒక ఉసిరి కాయ తింటే హైబీపీకి చెక్ పెట్టొచ్చు. ఉసిరి రక్తనాళాలను వెడల్పు చేస్తుంది. దీంతో రక్తం సరఫరాకు ఎలాంటి ఆటంకాలూ ఉండవు. ఫలితంగా గుండె జబ్బులూ దరిచేరవు. ఉసిరి కాయలను పచ్చడి కూడా పెట్టుకుంటారనే విషయం విధితమే. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం రెండూ ఉసిరితో మన సొంతం.

health benifits high bp use By Ayurvedic products

health benifits high bp use By Ayurvedic products

త్రిఫల : High Bp

త్రిఫల అంటే మూడు కాయల మిశ్రమం. ఒకటి.. ఉసిరి కాయ. రెండు.. కరక్కాయ. మూడు.. తానికాయ. ఈ మూడు కాయలూ కలిస్తే హైబీపీ మటుమాయం. ఈ పౌడర్ ని రోజూ రాత్రి పూట పడుకోబోయే ముందు గోరు వెచ్చని నీటిలో కలుపుకొని తాగితే జీర్ణ సమస్యలు సైతం దూరమవుతాయి. ఒంట్లో కొవ్వు తగ్గుతుంది.

health benifits high bp use By Ayurvedic products

health benifits high bp use By Ayurvedic products

అర్జున :

అర్జున చెట్టు బెరడును పొడి చేసుకొని లేదా ట్యాబ్లెట్ల రూపంలో వాడితే రక్త పోటు మామూలు స్థితికి వస్తుంది. నిత్యం ఉదయం, సాయంత్రం వాడాలి. గుండె సంబంధ అనారోగ్యం తేలిగ్గా తగ్గిపోతుంది. ఈ ఐదింటిలో ఏ ఒక్కటి వాడినా సరిపోతుంది. అశ్వగంధ, అర్జున తప్ప మిగతా మూడూ సహజసిద్ధంగానే దొరుకుతాయి.

ఇది కూడా చ‌ద‌వండి ==> డయాబెటిక్స్ ఉన్నవారు ఎలాంటి ఫ్రూట్స్ తినవచ్చు? పండ్లలో ఉండే ఏ పోషకాలు షుగర్ అదుపులో ఉంచుతుంది!!

ఇది కూడా చ‌ద‌వండి ==> మన పక్కనే ఉండే బిళ్ల గన్నేరు తో ఎన్నో వెలకట్టలేని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలో మీకు తెలుసా..?

ఇది కూడా చ‌ద‌వండి ==> రోజూ ఒక గ్లాస్ తిప్పతీగ జ్యూస్ తాగితే క‌లిగే అద్భుతమైన ప్ర‌యోజ‌నాలు..!

ఇది కూడా చ‌ద‌వండి ==>  మీ జీర్ణవ్య‌వ‌స్థ ఆరోగ్యంగా ఉండాలంటే … రోజు ప‌ర‌గ‌డుపున ఇవి తాగండి…?

kondalrao

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది