డయాబెటిక్స్ ఉన్నవాళ్లు ఏ పండ్లు తినాలి? ఏవి తినకూడదు? ఏ పండ్లు షుగర్ ను అదుపులో ఉంచుతాయి?
ఆరోగ్యమే మహాభాగ్యమనే సామెత అక్షరాల సత్యం. ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటే దాన్ని మించిన సంపద ఇంకోటి అవసరం లేదు. ఒక్కసారి ఆరోగ్యం దెబ్బతిన్నది అంటే కనీసం పండ్లు తినడానికి కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వస్తుంది. అలాగే ఇప్పుడు డయాబెటిక్స్ బాధపడేవారు కూడా కనీసం పండ్లు తినడానికి కూడా ఆలోచించాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు డయాబెటిక్స్ తో బాధపడేవారు ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి? ఫ్రూట్స్లో ఉండే ఈ పదార్థాలు బాడీలో షుగర్ లెవెల్స్ పై ప్రభావం చూపుతాయో తెల్సుకుందాం.
మనం తీసుకునే ఆహార పదార్థాలే మన బాడీలో షుగర్ లెవెల్స్ ను డిసైడ్ చేస్తాయి. మనం తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటే బాడీ లో షుగర్ లెవెల్స్ అమాంతం పెరుగుతాయి. ఇలా మన బాడీలో షుగర్ లెవెల్స్ ను తెలిపే కొలమనాన్ని గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారు. ఫ్రూట్స్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే పదార్థాలను షుగర్ ఉన్నవాళ్లు ఎలాంటి సందేహం లేకుండ ఆతినవచ్చు.
గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే పండ్ల వివరాలు:
1. యాపిల్ ను ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారైన ధైర్యంగా తినవచ్చు. ఎందుకంటే ఇందులో ఉన్న పోషకాలు విటమిన్ సి, పీచు పదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ పండ్లలో ఉండే పీచు, పాలిఫినాల్స్ కార్బొహైడ్రేట్ల శోషణను తగ్గిస్తాయి. దీంతో రక్తంలో షుగర్ లెవల్స్ పెరగవు. యాపిల్ పండ్లలో చక్కెర ఉంటుంది. కానీ అది ఫ్రక్టోజ్ రూపంలో ఉంటుంది. ఇది రక్తంలో షుగర్ లెవల్స్ పై పెద్దగా ప్రభావం చూపదు. పైగా యాపిల్ పండ్లను తినడం వల్ల ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. దీంతో చక్కెర స్థాయిలు పెరగవు. యాపిల్ పండ్ల గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) విలువ 36 మాత్రమే. డైలీ ఒక్క ఆపిల్ తినడం వల్ల డాక్టర్ కు దూరంగా ఉండొచ్చు అనే మాటకు ఆపిల్ 100% నిజం చేస్తుంది.
2. స్ట్రాబెర్రీలలో ఇందులో జీఐ విలువ 46. వీటిలో పీచు ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ మెరుగ్గా పని చేస్తుంది. వీటిని తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ పెరగవు. ఈ పండ్లను తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్ తో పోరాడే శక్తి లభిస్తుంది. బరువును తగ్గించడంలో ఈ పండ్లు సహాయ పడతాయి.
3. గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటూ షుగర్ ను అమాంతం పెంచకుండా ఉండే ఫ్రూట్స్ లో దానిమ్మ పండు మొదటి స్థానంలో ఉంటుంది. ఇందులో కూడా పిండి పదార్థాలు, చక్కెరలు ఉంటాయి కానీ చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. దానిమ్మలో పీచు అధికంగా ఉంటుంది కాబట్టి జీర్ణక్రియ పనితీరు కూడా మెరుగుపడుతుంది. షుగర్ ఉన్నవారు తమ రోజువారి ఆహారపు అలవాట్లలో దానిమ్మను చేర్చుకోవచ్చు.
4. జిఐ తక్కువగా ఉంటూ ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో జామకాయ ఉంటుంది. ఇందులో జీఐ కేవలం 12 మాత్రమే. రక్తంలో షుగర్ లెవల్స్ ను తగ్గించడంలో జామకాయలు అద్భుతంగా పనిచేస్తాయి. ఈ పండ్లలో పీచు ఎక్కువగా ఉంటుంది. ఇది చక్కెర శోషణను నియంత్రిస్తుంది. దీంతో చక్కెర స్థాయిలు పెరగవు. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు ఈ పండ్లను రోజూ తింటే మంచిది.
5. బొప్పాయి ను కూడా గ్లైసిమిక్ ఇండెక్స్ మధ్యస్థంగా ఉండే పదార్థాల విభాగంలో చేర్చవచ్చు. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, పీచు అధికంగా ఉంటాయి. కనుక వీటిని అప్పుడప్పుడు తినవచ్చు. బొప్పాయి పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్ను నాశనం చేస్తాయి. జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. కనుక వీటిని తరచూ తింటే మంచిది.
6. ద్రాక్ష పండ్లను మధ్యస్థ గ్లెసీమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్ విభాగంలో చేర్చవచ్చు. ఇందులో జీఐ 53-59 మధ్య ఉంటుంది . ద్రాక్ష పండ్లను తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ఈ పండ్లలో విటమిన్ సి, రెస్వెరాట్రోల్ అనే సమ్మేళనం ఉంటాయి. ఇవి ఇన్సులిన్ ను శరీరం గ్రహించేలా చేస్తాయి. దీంతో రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. రక్తంలో చక్కెర నిల్వ అవకుండా చూస్తాయి.
7. బత్తాయి పండ్లలో విటమిన్ సి, పీచు, ఫోలేట్, పొటాషియం అధికంగా ఉంటాయి. ఈ పండ్ల జీఐ విలువ 40 వరకు ఉంటుంది. అందువల్ల వీటిని డయాబెటిస్ ఉన్నవారు ఎలాంటి భయం చెందకుండా తినవచ్చు. బత్తాయి పండ్లను తినడం వల్ల శరీరానికి మేలే జరుగుతుంది.
ఇలా గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కుగా ఉన్న పండ్లను షుగర్ వ్యాధి ఉన్నవారు కూడా నిర్భయంగా తినవచ్చు. ఆహారపు అలవాట్లతో పాటు ప్రతిరోజు వ్యాయామం కూడా చెయ్యాలి. మనకు ఎలాంటి వ్యాధులు ఉన్నా, లేకున్నా ప్రతిరోజు వ్యాయామం చెయ్యడం వల్ల మనం ఆక్టివ్ గా ఉంటాం. కాబట్టి ఆహారపు అలవాట్లతో పాటు వ్యాయామం తప్పనిసరి.