Health Problems : చలికాలంలో వచ్చే ఈ సమస్యలకు చెక్ పెట్టండి ఇలా…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Health Problems : చలికాలంలో వచ్చే ఈ సమస్యలకు చెక్ పెట్టండి ఇలా…!

Health Problems : అన్ని కాలాలలో కంటే చలికాలంలో ఎక్కువగా దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకే చలికాలంలో ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈ కాలంలో అనేక అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ముందు జాగ్రత్తగా చలికాలంలో వచ్చే ఈ సమస్యలను అదుపులో పెట్టుకోవచ్చు అంటున్నారు వైద్యనిపుణులు. సాధారణంగా జలుబు, దగ్గు, జ్వరం వస్తూనే ఉంటాయి. అయితే నిపుణులు చెప్పిన దాని ప్రకారం బలహీనమైన రోగనిరోధక శక్తి […]

 Authored By prabhas | The Telugu News | Updated on :25 October 2022,6:00 am

Health Problems : అన్ని కాలాలలో కంటే చలికాలంలో ఎక్కువగా దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకే చలికాలంలో ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈ కాలంలో అనేక అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ముందు జాగ్రత్తగా చలికాలంలో వచ్చే ఈ సమస్యలను అదుపులో పెట్టుకోవచ్చు అంటున్నారు వైద్యనిపుణులు. సాధారణంగా జలుబు, దగ్గు, జ్వరం వస్తూనే ఉంటాయి. అయితే నిపుణులు చెప్పిన దాని ప్రకారం బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు ఎక్కువగా ఈ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. జలుబు, ఫ్లూ వచ్చినప్పుడు అలసట, నీరసం, తలనొప్పి ఒళ్ళు నొప్పులు ఎక్కువగా వస్తాయి.

కీళ్ల నొప్పులతో బాధపడే వారికి చలికాలం ఆ సమస్య మరింత ఎక్కువ ఉంటుంది. చల్లటి వాతావరణం వలన వారి సమస్య కూడా పెరుగుతుంది. చలికాలంలో వాతావరణ పీడనం తగ్గడం వలన శరీరంలో పెన్ గ్రాహకాలు మరింత సున్నితంగా మారుతాయి. దీనివలన కీళ్లలో వాపులు వచ్చి నొప్పి ఎక్కువ అవుతుంది. దీంతో కీళ్ల నొప్పులు ఉన్న వ్యక్తులు ఎక్కువగా బాధపడతారు. చలికాలంలో చెవి మూసుకుపోవడం, దురదతో పాటు నొప్పి సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి. అధిక చలి కారణంగా చెవిలో ఇన్ఫెక్షన్ సమస్య వస్తుంది. ఈ పరిస్థితుల్లో నొప్పి ఎక్కువ కాకుండా వైద్యులను సంప్రదించడం మంచిది.

Health problems can be extremely debilitating in winter

Health problems can be extremely debilitating in winter

చిన్నపిల్లలు, శిశువులకు బ్రొన్కియోలిటిస్ అనే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. దీని కారణంగా ఊపిరితిత్తుల గాలి మార్గాల్లో స్లేష్మం ఏర్పడుతుంది. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది అందుకే కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటున్నారు వైద్యులు. బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా ఈ సమస్యలనేవి వస్తాయి. వీటిని నిరోధించడానికి రోగనిరోధక శక్తి బలంగా ఉండడం అవసరం. అందుకే ఎక్కువగా తులసి కషాయాలను తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. యోగ చేయాలి. చలి నుంచి రక్షించుకోవడానికి వెచ్చని దుస్తులను ధరించాలి. బయట ఆ

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది