Health Problems : జ్వరం వచ్చినవాళ్లు చేపలు, చికెన్ తీసుకోవచ్చా… ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది… మీకోసం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Problems : జ్వరం వచ్చినవాళ్లు చేపలు, చికెన్ తీసుకోవచ్చా… ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది… మీకోసం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్…

 Authored By aruna | The Telugu News | Updated on :12 September 2022,6:30 am

Health Problems : ప్రస్తుతం వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ఎక్కడ పడితే అక్కడ నీరు నిలుస్తూ ఉంటాయి. ఆ నిలువున్న నీటిలో బ్యాక్టీరియా తయారై ఆ బ్యాక్టీరియా ద్వారా ఎన్నో రోగాలు సంభవించేలా చేస్తున్నాయి. ఈ వర్షాల పట్ల జాగ్రత్తలు వహించకపోతే జ్వరాలు, జలుబులు సంభవించే అవకాశం ఉంది. ఈ వర్షాకాలంలో మీ పర్యావరణాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. నీటిలో నిలవ ఉండే దోమలు వలన టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ సంభవిస్తాయి. అయితే ఇటువంటి జ్వరాలు వచ్చిన వాళ్ళకి తీసుకునే ఆహారం విషయంలో పలువురికి అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎటువంటి ఆహారం తీసుకోవాలి. ఎటువంటి ఆహారం తీసుకోకూడదు. అనే విషయాలు పై ఎన్నో అనుమానాలు వస్తూ ఉన్నాయి.

ఇలాంటి జ్వరాలు వచ్చినవాళ్లు మాంసాలను తీసుకోవద్దని తెలియజేస్తూ ఉంటారు. అయితే దీనిపై వైద్య నిపుణులు కొన్ని ఆసక్తికర విషయాలను తెలియజేస్తున్నారు. అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. ఒక వ్యక్తికి జ్వరం వచ్చినప్పుడు సహజంగా ఆహారం తేలికగా జీర్ణం అయ్యేది తీసుకుంటూ ఉండాలి. అలా తీసుకోవడం వలన తొందరగా జీర్ణమై వెంటనే శక్తినిస్తుంది.
అయితే చేపలు, చికెన్, గుడ్లు లాంటి నాన్ వెజ్ ఆహారం తీసుకుంటే అవి జీర్ణం అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. కావున కడుపులో అజీర్తి లాంటి ఇబ్బందులు ఉచ్చున్నమవుతాయి. అంతే కానీ అవి తీసుకోవడం వలన జ్వరం అధికమవుతుంది. ఇతర రోగాలు వస్తాయి అనేది వాస్తవం కాదని పేర్కొంటున్నారు. కావున జ్వరం వచ్చినప్పుడు మాంసాహారం తీసుకోవాలని ఆశ కలిగితే నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. వీటిని తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

Health Problems Of Eating Fish And Chicken On Fever Will Face This Problems

Health Problems Of Eating Fish And Chicken On Fever Will Face This Problems

బాడికి ప్రోటీన్, కార్బోహైడ్రేట్ కావాలి కాబట్టి వీటిలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. కావున వీటిని తీసుకోవడం వల్ల ఎటువంటి సమస్య రాదు అని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే కొందరికి జ్వరం వస్తుంటే వాంతులు, వికారం లాంటి ఇబ్బంది ఉంటుంది. అటువంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు చికెన్ ,చేపలు లాంటి వాటికి దూరంగా ఉండాలి. అలాగే కారం, మసాలా కూడా తక్కువే తీసుకోవాలి. అజీర్తి ,వికారం ఇలాంటి ఇబ్బందులు కనపడితే మాత్రం కూరగాయల ఆహారాన్ని తినాలి. అని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ నాన్ వెజ్ వలన ఎముకలు, మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి. దీనిలో ఆరోగ్యకరమైన ప్రోటీన్లు విటమిన్లు ఆమ్లాలు సెలీనియం లాంటివి పుష్కలంగా ఉంటాయి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది