Health Problems : పసుపు ఎక్కువగా తీసుకుంటే కిడ్నీలో రాళ్లు వస్తాయని మీకు తెలుసా…?
Health Problems : పసుపుని ప్రతి ఒక్కరు వాడుతారు. ఇంకా ఫేస్ ప్యాక్స్ లో కూడా వాడుతుంటారు. ఇన్ఫెక్షన్ రాకుండా పసుపును ఉపయోగిస్తారు. శరీరం మొత్తానికి పసుపు రాస్తారు. అయితే పసుపు ఎక్కువగా వాడడం వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుంది. అందుకే పసుపును పరిమితంగా తీసుకోవాలి. అది ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే శరీరానికి హాని కలుగుతుంది. తినే ఆహారంలో పసుపుని కొంచమే వాడాలి. కొద్దిగా టీ స్పూన్ పరిమాణంలో వేస్తాం. ఆరోగ్య నిపుణుల ప్రకారం ఒక మనిషి 500 మిల్లి గ్రాములు పసుపు తినవచ్చు. ఇది ఒకటి మూడు గ్రాములు గా ఉంటుంది. దీని కంటే ఎక్కువగా తీసుకుంటే ప్రమాదమే అని చెప్పాలి. ఇలా తీసుకోవడంపై ఆరోగ్య పరిస్థితి ఆధారపడి ఉంటుంది.
పసుపును ఎక్కువగా తీసుకుంటే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే దాన్ని పరిమితంగా తీసుకోవాలి .ఎక్కువగా తీసుకుంటే కడుపునొప్పి, విరోచనాలుర ఉబ్బరం, తల తిరగడం, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. అదేవిధంగా ఆక్సలైట్స్ పెరగడం వల్ల కిడ్నీలో రాళ్లు కూడా ఏర్పడతాయి. పసుపు చర్మానికి రాసినప్పుడు అంతగా దుష్ప్రభావం చూపదు. అందుకే పసుపును ఫేస్ ప్యాక్ లో కూడా వాడుతారు. పసుపు చర్మానికి మంచి చేస్తుంది. పిత్తాశయ సమస్యలు, రక్తస్రావం, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు పసుపును తక్కువగా తీసుకోవాలి. షుగర్ ఉన్న వారు కూడా పసుపును తక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే పసుపులో ఉండే కర్కుమిన్ రక్తంలో చక్కెర స్థాయిని బాగా తగ్గిస్తుంది.
ఐరన్ లోపం ఉన్నవారు పసుపును తీసుకోకూడదు. ఎందుకంటే ఇది ఇనుమును గ్రహించే శక్తిని లాగేస్తుంది. పసుపులో ఉండే కర్కుమిన్ కొవ్వు కణాలను పెరగకుండా చేస్తుంది. కర్కుమిన్ 11 బీటా హైడ్రాక్సీ స్టెరాయిడ్ డీహైడ్రేజనేజ్ ఎంజైమ్ ని అణచీవేయగలదు. చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. ఇన్సులిన్ నిరోధకతను నిరోధిస్తుంది. దీని ఫలితంగా శరీరంలో కొవ్వు నిల్వ ఉండదు. పసుపు గ్యాస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంలో పురుగులను తొలగిస్తుంది. జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. ఆర్థరైటిస్ రోగులకు నొప్పి నియంత్రణ చేస్తుంది.