Health Tips : కొత్తిమీరను తినకుండా పడేస్తున్నారా… అయితే ఈ ఆసక్తికర విషయాలను తప్పక తెలుసుకోండి…!!
Health Tips : కొత్తిమీరలో బోలెడన్ని ఔషధ గుణాలు ఉంటాయి అన్న విషయం అందరికీ తెలిసినదే.. దీన్ని ఎక్కువగా వంటల్లో నాన్ వెజ్ లో వాడుతూ ఉంటాం. ఈ కొత్తిమీరను వంటల్లో వాడడం వలన మంచి సువాసనతో మంచి రుచి కూడా పెరుగుతుంది. కొత్తిమీర ఆహారం లో రుచిని రెట్టింపు చేయడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. కావున భారతీయులు ఏ కూర చేసినా కచ్చితంగా కొత్తిమీర వేస్తూ ఉంటారు అయితే కొత్తిమీరని కూరల్లో వేసినప్పటికీ చాలామంది కరివేపాకు తీసేసినట్టు తీసేసి పక్కన పడేస్తూ ఉంటారు. కొత్తిమీరను తినడానికి చాలామంది ఇష్టపడరు.
అయితే కొత్తిమీరను కొన్ని రకాల కూరలు లేదా చెట్నీ చేసుకొని తింటే మంచి రుచి తో పాటు ఆంటీ ఆక్సిడెంట్ ఎన్ని రకాలు సుగుణాలు విటమిన్, ఏ సి క్యాల్షియం, మెగ్నీషియం శరీరానికి పుష్కలంగా అందుతాయి. కొత్తిమీరలోని యాంటీబయోటిక్ మూలకాలు బ్లడ్ లోని షుగర్ లెవెల్సిన తగ్గించి ఇన్సులిన్ ని ఉత్పత్తి చేస్తాయి. ఈ మూలంగా కొత్తిమీర జ్యూస్ ను పరిగెడు న తాగితే మధుమేహం కంట్రోల్లో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అయితే కొత్తిమీర రసంలో కొంచెం చక్కర నీరు కలిపి ఖాలి కడుపుతో వారం రోజులు పాటు తీసుకోవడం వలన మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
లినోలిక్, ఫార్మేటిక్ లాంటి ఆసిడ్స్ కొత్తిమీరలో అధికంగా ఉంటాయి .
ఇవి గుండేసంబంధిత సమస్యలు ప్రముఖ పాత్ర పోషించి జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి.అలాగే లివర్ పనితీరు కూడా మెరుగుపరుస్తుంది. నిత్యం కొత్తిమీర చట్నీ తింటూ ఉండటం అలాగే ధనియాల పొడిలో కొద్దిగా తేనె తీసుకుని తీసుకుండడం వలన జ్ఞాపకశక్తి పెరుగుతుంది. కొత్తిమీర డైజేషన్ కి బాగా ఉపయోగపడుతుంది. శరీరంలో సోడియంను బయటికి పంపి రక్తపోటును తగ్గిస్తుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ ను కూడా కంట్రోల్ చేస్తుంది. కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కావున ఈ కొత్తిమీరను నిత్యం తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యం పొందవచ్చు..