Health Tips : ఆహారం తినే టైంలో నీటిని తాగుతున్నారా.? అయితే ఆనారోగ్య సమస్యలు తప్పవు…!!
Health Tips : చాలామంది ఆహారం తీసుకునే సమయంలో నీటిని తాగుతూ ఉంటారు. సహజంగా ఆహారం తీసుకునే సమయంలో నీటిని తాగినట్లయితే ఎన్నో అనారోగ్య సమస్యలు తప్పవు అని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఆహారం తీసుకునేటప్పుడు నీళ్లు ఎక్కువగా తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. వాటికి కారణం తినే ఆహారం మింగడానికి ఈజీగా ఉంటుంది. అయితే ఈ విధంగా చేయడం వలన ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు తెలియజేయడం జరిగింది. ఆహారం ఎప్పుడు తీసుకున్న సరే నీళ్లు తాగొద్దని తెలియజేస్తున్నారు..
ఆహారం తీసుకున్నాక ఎప్పుడు నీటిని తాగాలి.. సాధారణంగా చాలామంది ఆరోగ్య నిపుణులు ఆహారం తిన్న వెంటనే నీరు తాగొద్దని చెప్తుంటారు. ఆహారం తీసుకున్న అరగంట తర్వాత మాత్రమే నీటిని తాగడం చాలా మంచిది. ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణ క్రియ కూడా మెరుగుపడుతుంది. నీరు త్రాగడం జీర్ణవ్యవస్థను ప్రభావితం: క్రమం తప్పకుండా నీటిని తాగితే ఇది మీ శరీరాన్ని హైడ్రేటుగా ఉంచడమే కాకుండా జీర్ణవ్యవస్థను బాగు చేస్తుంది. అలాగే ఆహారం తినే సమయంలో నీళ్లు తాగితే హాని కలుగుతుంది.
అందుకే తినేటప్పుడు నీటి తాగడం అంత మంచిది కాదు. మీరు తాగడం వల్ల జీర్ణ ప్రక్రియలో సమస్యలు వస్తుంటాయి. కావున దీని కారణంగా పొట్ట పెరుగుతుంది. నెమ్మదిగా లావు అవుతారు. శరీర ఆకృతి పూర్తిగా చెడిపోతుంది. ఆహారం తినేటప్పుడు నీళ్లు ఎందుకు తాగకూడదు: ఆహారం నోట్లోకి తీసుకున్న తర్వాత దానిని ఆ తర్వాత నోట్లోని గ్రంధులు లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఆ లాలాజలంలో ఆహారాన్ని విచ్ఛిన్నం చేసే ఎంజైములు ఉంటాయి. ఈ ఎంజైమ్లు కడుపులోని ఆమ్లా గ్యాస్టిక్ రసంతో అవుతాయి. మందపాటి ద్రవ్యాన్ని ఏర్పరుస్తాయి. ఈ ద్రవాలు చిన్న ప్రేగుండ వెళ్లి పోషకాలను గ్రహించడంలో ఉపయోగపడతాయి.