Health Tips : బాగా ఆకలి వేయాలంటే… ఈ చిట్కాను పాటించండి…
Health Tips : కొంతమందికి ఆకలి అనేది చాలా తక్కువగా ఉంటుంది. దీనివలన వారు బక్కగా, అనారోగ్యంగా ఉంటారు. అలాగే ప్రస్తుతం ఉన్న ఆహారపు అలవాట్లు వలన అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. గ్యాస్ ట్రబుల్, అజీర్తి, మలబద్ధకం, ఎసిడిటీ ఇలా ఎన్నో సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలను తప్పించుకోవడం కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. హాస్పిటల్స్ అందించే మందులను ఎక్కువగా ఉపయోగిస్తే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అన్ని సమస్యలకు టాబ్లెట్స్ మీద ఆధారపడకుండా నేచురల్ పద్ధతిలో కూడా కొన్ని సమస్యలను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించుకోవచ్చు. అజీర్తి సమస్య ఉండడం వలన కడుపు బరువుగా ఉండడం, ఆకలి వేయకపోవడం వంటి సమస్యలు వస్తాయి. వాటిని తగ్గించుకొని ఆకలి బాగా వేయాలంటే ఈ చిట్కాను ట్రై చేసి చూడండి.
ఈ చిట్కాను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ముందుగా దీనికోసం ఒక స్పూన్ మిరియాల పొడి తీసుకొని మెత్తగా పొడి లాగా చేసుకోవాలి. మార్కెట్లో దొరికే మిరియాల పొడిని ఉపయోగించకూడదు. వాటిలో ఏం కలుపుతారో మనకు తెలియదు. అలాంటి వాటిని ఉపయోగించకపోవడమే మంచిది. మెత్తగా దంచిన మిరియాల పొడిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఒక స్పూన్ తేనె వేసుకోవాలి. దీనికోసం పట్టుతేనే మాత్రమే ఉపయోగించాలి. మార్కెట్లో దొరికే తేనె ఉపయోగించకూడదు. ఎందుకంటే వాటిలో షుగర్ సిరప్, కార్న్ సిరప్ వంటివి కలుపుతారు. వీటి వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.
ఇప్పుడు మిరియాల పొడిని తేనెను బాగా కలుపుకొని రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తీసుకోవడం వలన కడుపు తేలిక పడుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఆకలి బాగా వేస్తుంది. అస్సలు ఆకలి వేయట్లేదు, కడుపు బరువుగా ఉంది అనుకున్నప్పుడు ఒకసారి ఈ చిట్కాను ఉపయోగిస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఇది నాచురల్ చిట్కా కాబట్టి దీనివలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగవు. కాబట్టి అన్ని వయసులవారు ఉపయోగించవచ్చు. టాబ్లెట్స్ వాడి అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకునే బదులు ఇలాంటి చిట్కాలను పాటించడం మంచిది. దీనిని జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ చిట్కాను పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.