Health Tips : ఉదయమే వెచ్చటి నీటిలో బెల్లం తీసుకుంటే చాలా లాభాలు
రోజూ ఉదయమే వెచ్చని నీటిని తాగితే చాలా ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు చెబుతుంటారు. ఖాళీ కడుపుతో వెచ్చని నీరు తాగితే రోజంతా ఉత్సాహంగా ఉండటంతో పాటు బరువు కూడా తగ్గుతారని అంటారు. అలాగే రోజూ బెల్లం తినడం వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య లాభాలు ఉంటాయి.
నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో గోరు వెచ్చటి నీటిలో కొద్దిగా బెల్లం కలుపుకుని ఆ నీటిని తీసుకుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి. బరువు తగ్గడంతో పాటు కడుపు సంబంధిత సమస్యలు చాలా వరకు తగ్గు ముఖం పడతాయి.బెల్లంలో విటమిన్ బి-1, బి-6, సి, మెగ్నీషియం, పొటాషియం, కార్పొహైడ్రేట్, ఐరన్, సోడియం ఎనర్జీ, చక్కెర మొదలైన అనేక పోషకాలు ఉన్నాయి. ఈ పోషకాలు అన్నీ ఎంతో మేలు చేస్తాయి. బెల్లంలో పుష్కలంగా ఐరన్ ఉంటుంది. దీని వల్ల శరీరంలో రక్త లోపాం తగ్గుతుంది.
వెచ్చటి నీటితో బెల్లం తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగు అవుతుంది. కిడ్నీ సంబంధిత సమస్యలూ తగ్గుముఖం పడతాయి.
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా పోరాడుతుంది. శరీరాన్ని ఉత్సాహ పరుస్తుంది.
బెల్లంలో విటమిన్ సి ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
కాలేయం నుండి విష పదార్థాలను సులభంగా బయటకు పంపుతుంది.
బెల్లం తీసుకోవడం వల్ల ఎర్ర రక్త కణాలు పెరుగుతాయి. రక్త హీనత తగ్గిస్తుంది.
గోరు వెచ్చటి నీటిలో బెల్లం కలుపుకోని ఉదయం నిద్ర లేచాక తాగాలి. రోజూ నిద్ర లేవగానే ఈ నీటిని తీసుకుంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. ఇలా నీళ్లలో కలుపుకుని తాగడం ఇష్టం లేని వాళ్లు.. ముందు చిన్న బెల్లం ముక్కను చప్పరించి.. తర్వాత నీళ్లు తాగినా సరిపోతుంది. కేవలం బెల్లం నీళ్లు తీసుకోవడమే కాకుండా.. బెల్లం తో చేసిన ఆహార పదార్థాలు తీసుకున్నా.. చాలా ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు చెబుతారు. ఆయుర్వేదంలో బెల్లం వాడకం చాలా ఎక్కువ. కషాయాలు తీసుకున్న సమయంలోనూ బెల్లం తీసుకోవచ్చని ఆయుర్వేద వైద్యులు సూచిస్తారు. చక్కెర కంటె కూడా బెల్లం వల్ల ఎన్నో రెట్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయన్నది తెలిసిందే.