Health Tips : పులిసినవి తింటే ఆరోగ్యానికి మంచిదా… కాదా…?
Health Tips : సాధారణంగా మనం ఇడ్లీ పిండి, దోసెల పిండిని పులియబెట్టి వేసుకోవడం అలవాటు. అలాగే చల్ల పునుకులకు, ఊతప్పం వంటి వాటికి కూడా పిండిని పులియబెట్టి వేసుకొని తింటాం. ఇలా పులియడం అనేది మన ఆరోగ్యానికి ఎంతవరకు మంచిది, అతిగా పులియడం వలన మన ఆరోగ్యానికి ఎటువంటి నష్టం కలగజేస్తుంది, అలాగే ఇవి అసలు ఎందుకు పులుస్తాయి, పులిసినప్పుడు వీటిలో ఎటువంటివి విడుదలవుతాయి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం తినే ఆహారంలో ఉండే కార్బోహైడ్రేట్స్ తో గాలిలో ఉండే బ్యాక్టీరియా చేరి కార్బోహైడ్రేట్స్ బ్యాక్టీరియాలు తమకు కావలసిన విధంగా మార్చుకొని వాటి నుంచి అవి శక్తిని విడుదల చేసి బ్రతుకుతాయి. ఈ సమయంలో కొత్త వ్యర్ధాలు విడుదలవుతాయి.
ఇలా విడుదల అయిన వ్యర్ధాలు మొదటిగా బ్యాక్టీరియాలో శక్తిగా కార్బోహైడ్రేట్స్ మారినప్పుడు రిలీజ్ చేసే వేస్ట్ లో ఆల్కహాల్, గ్లిజరాల్, కార్బన్ డయాక్సైడ్, లాక్టిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్, కొన్ని విటమిన్స్. ఇవన్నీ పులిసినప్పుడు తయారవుతాయి. కార్బోహైడ్రేట్స్ లో బ్యాక్టీరియా చేరి వాటికి కావలసిన విధంగా మార్చుకున్నప్పుడు విడుదల అయ్యే వ్యర్ధపదార్థాలు ఇవి. ఇలా పులిసిన వాటి వల్ల లాభం కలిగే వాటిని మన బాడీ ఉపయోగించుకుంటుంది. అంతేకాకుండా కొన్ని నష్టాలు కలిగించే వాటిని కూడా అందించినట్లు అవుతుంది.
పులిసిన వాటి వలన కొన్ని ఉపయోగపడే బ్యాక్టీరియాలు విడుదలవుతాయి. ఇడ్లీ పిండి, పెరుగు వంటి వాటిని ఐదు ఆరు గంటల వరకు పులియబెడితే ఎటువంటి నష్టం ఉండదు. ఇందులో విడుదల అయ్యే యాసిడ్స్ ప్రేగులలో ఫ్రెండ్లీ బ్యాక్టీరియా తయారవ్వడానికి ఉపయోగపడతాయి. అలాగే కొన్ని విటమిన్స్ అందించడానికి ఇవి సహాయపడతాయి. ఇలాంటి వాటిని అతిగా నిలువ చేస్తే బాగా పులిసిపోతాయి. పులసిన రుచి తెలియకపోయినా లోపల కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఇలా మంచిది కాదు. దీని వలన హాని ఎక్కువగా జరుగుతుంది. పేగులలో చెడు బ్యాక్టీరియా విడుదల అవడం వలన అల్సర్ రావడం, గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందువలన అతిగా పులియబెట్టడం ఆరోగ్యానికి మంచిది కాదు.