Health Tips : ఆఫ్రికాట్లను తింటే కొవ్వు రమ్మన్నా రాదు..
Health Tips : ఆఫ్రికాట్… ఈ పండు గురించి చాలా మందికి తెలియదు. కానీ ఈ పండును తినడం వలన మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. నేటి రోజుల్లో కొవ్వుతో ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. అనవసర కొవ్వు చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ కొవ్వును తగ్గించుకునేందుకు చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా ఖర్చు పెట్టి డైట్ ఫాలో అవుతున్నారు. కానీ ఈ డైట్ వలన కూడా కొంత మందికి సరైన ఫలితాలు రావడం లేదు. అటువంటి వారు మరలా తిరిగి ప్రకృతి ఆరోగ్యం వైపు అడుగులేస్తున్నారు.
మనకు ప్రకృతి అనేక వరాలను ప్రసాదించింది. ఈ జగత్తులో మనకు ఎన్నో రకాల ఫ్రూట్స్ లభిస్తున్నాయి. వీటిని సరిగ్గా తీసుకుంటే మన బాడీలో ఉన్న కొవ్వును ఇట్టే తగ్గించుకోవచ్చు. అలా మన బాడీలో ఉన్న కొవ్వును తగ్గించే ఒక పండే ఆఫ్రికాట్.మనకు డ్రై ఫ్రూట్స్ అంటే ఎండు ఖర్జూరాలు, కిస్మిస్ లు మొదలయినవి మాత్రమే తెలుసు. కానీ ఈ ఆఫ్రికాట్ గురించి మనలో చాలా మందికి తెలియదు. ఈ ఫ్రూట్ తీసుకోవడం వలన శరీరంలో ఉండే కొవ్వు తగ్గుతుంది. ఈ పండులో ఎటువంటి షుగర్ లెవల్స్ ఉండవు. కాబట్టి ఈ పండును తినడం వలన అనేక ఉపయోగాలు ఉంటాయి.
Health Tips : ఎండ బెట్టుకుని తింటే ఎన్ని ప్రయోజనాలో..
మన బాడీలో ఉన్న కొవ్వును కరిగించడం కోసం యాంటీ యాక్సిడెంట్స్ చాలా అవసరం. ఈ పండులో అనేక విధాలైన యాంటీ యాక్సిడెంట్స్ ఉంటాయి. వీటి వలన మన శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. వేరే దేశాల్లో పచ్చి ఆఫ్రికాట్స్ దొరుకుతాయి. కానీ మనకు కేవలం డ్రై ఆఫ్రికాట్స్ మాత్రమే లభిస్తాయి. 100 గ్రాముల ఆఫ్రికాట్స్ తీసుకుంటే అందులో 7.5 గ్రాముల నీటి శాతం, 300 కేలరీల శక్తి ఉంటుంది. కేవలం కొవ్వు తగ్గడం కోసం చూసే వారు మాత్రమే కాకుండా డయాబెటిస్ తో బాధపడే వారు కూడా ఈ పండ్లను తీసుకోవడం వలన మంచి ప్రయోజనం కలుగుతుంది.