Health Tips : జలుబు, దగ్గు, గొంతు నొప్పికి చెక్ పెట్టాలంటే.. ఈ ఒక్క ఆకు నోట్లో వేసుకుంటే చాలు..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Tips : జలుబు, దగ్గు, గొంతు నొప్పికి చెక్ పెట్టాలంటే.. ఈ ఒక్క ఆకు నోట్లో వేసుకుంటే చాలు..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :9 April 2023,2:00 pm

Health Tips : చాలామంది ఎప్పుడు జలుబు, దగ్గు ,గొంతు నొప్పి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే ఈ సమస్య ప్రారంభంలో నే ఈ ఒక్క ఆకు నోట్లో వేసుకుంటే ఈ సమస్యలు అన్నిటికీ పెట్టవచ్చు.. అదే వామాకు ఈ ఆకును ఎన్నో రకాల మందులలో వినియోగిస్తూ ఉంటారు. ఈ చెట్టు ఇంట్లో సులభంగా పెంచుకోవచ్చు.. జలుబు, దగ్గు గొంతు నొప్పి ఉన్న టైం లో రోజుకి రెండుసార్లు ఈ వామాకును తింటే చాలు.. అలాగే ఈ రసాన్ని తీసి దానిలో తేనె కలిపి కూడా తీసుకోవచ్చు. ఈ సమస్యను తీవ్రతను బట్టి రెండు రోజులు తాగవచ్చు. ఈ ఆకు ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది.

Health Tips It is enough to put this one leaf in the mouth

Health Tips It is enough to put this one leaf in the mouth

అలాగే కడుపుబ్బరం ఉన్నవారికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ జలుబు, దగ్గులు వీటిని తొందరగా తగ్గించుకోవాలి అనుకుంటే.. ఈ ఆకుని నోట్లో వేసుకొని బుగ్గన పెట్టుకొని నెమ్మదిగా నమలుతు.. ఆ రసాన్ని కొంచెం కొంచెం గా మింగుతూ ఉంటే ఈ సమస్యలన్నీటికి మంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఈ వామాకుతో పకోడీ, బజ్జీలు అలాగే పచ్చడి ఇలాంటివి కూడా చేసుకుని తింటూ ఉంటారు. ఈ వామాకు మొక్కలు ప్రతిభాగంలోనూ ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. కావున ఈ మొక్కని తెచ్చి ఇంట్లో పెంచుకోండి.

Cough And Cold : ద‌గ్గు, జ‌లుబుల‌ను స‌త్వ‌ర‌మే త‌గ్గించే ఇంటి చిట్కాలు..!

అలాగే ఈ జలుబు సమస్య ఎక్కువ ఉన్న సమయంలో ఈ ఆకుల పొగను పిలిస్తే శ్వాస నాళాలు ఫ్రీ అయి శ్వాస బాగా ఆడుతుంది. చలికాలంలో ఉబ్బసం లాంటి సమస్యలు ఉన్నవారికి ఈ గొప్ప ఔషధం అని చెప్పవచ్చు. ఆయుర్వేదంలో దీని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. దగ్గును తగ్గించడమే కాకుండా ఈ ఆకుల్లో ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. దగ్గు, జలుబు లాంటివి వస్తే చాలా చికాకుగా అనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఈ ఆకుని రసం రూపంలో కానీ లేదా ఆకులు రూపంలో గానీ దీనిని తీసుకుంటే ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది