Cardamom : ఈ టైమ్ లో యాలకులు చేసే మేలు తల్లి కూడా చేయదు.. వెంటనే యాలకులు కొనుక్కొని తినేయండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Cardamom : ఈ టైమ్ లో యాలకులు చేసే మేలు తల్లి కూడా చేయదు.. వెంటనే యాలకులు కొనుక్కొని తినేయండి..!

 Authored By jagadesh | The Telugu News | Updated on :18 May 2021,10:00 am

Cardamom : కార్డమామ్.. దీన్నే తెలుగులో యాలకులు అని కూడా అంటారు. యాలకులు నిజానికి మన శరీరానికి ఎంతో మంచివి. అందుకే.. చాలామంది యాలకులను తమ ఆహారంలో భాగంగా నిత్యం తీసుకుంటుంటారు. చాలామంది యాలకులను వివిధ రకాలుగా తీసుకుంటుంటారు. యాలకులను పొడిగా చేసుకొని టీలో వేసుకోవడం.. కూరల్లో వేసుకోవడం.. ఇతర పదార్థాల్లో వేస్తుంటారు. యాలకులు లేకుండా ఏ తీపి వంటకం కూడా చేయరు. ఇలా మన ఆహారంలో యాలకులు భాగం అయిపోయాయి. ఎందుకంటే.. యాలకుల్లో అన్ని సుగుణాలు ఉన్నాయి కాబట్టే.. వాటిని మనం రోజూ ఏదో ఒక రూపంలో తింటున్నాం.

ప్రస్తుతం కరోనా మహమ్మారితో మనం అంతా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మహమ్మారి ఎక్కువగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తోంది. దీంతో ఊపిరితిత్తుల్లో సమస్యలు ఏర్పడుతున్నాయి. దీని వల్ల శ్వాస అందకపోవడం, ఇతర సమస్యలు వచ్చి మనిషి చనిపోయే ప్రమాదం కూడా ఏర్పడుతోంది. అయితే.. ఈ కరోనా సమయంలో వచ్చే లంగ్స్ ఇన్ఫెక్షన్ ను తగ్గించుకోవాలన్నా.. భవిష్యత్తులో ఊపిరితిత్తుల సమస్యలు రాకుండా ఉండాలన్నా ఖచ్చితంగా యాలకులను మీ ఆహారంలో భాగంగా చేసుకోవాల్సిందే.

cardamom is good for lungs health tips telugu

cardamom is good for lungs health tips telugu

Cardamom : ఇన్ఫెక్షన్, కఫం, దగ్గు.. అన్ని రకాల సమస్యలకు ఒకటే మందు.. యాలకులు

చాలామందికి బాగా కఫం వస్తుంటుంది. ఊపిరితిత్తుల్లో నిమ్మ వస్తుంది. అలాగే ఒక్కోసారి ఊపిరి ఆడదు. ఇన్ఫెక్షన్లు కూడా వస్తుంటాయి. అటువంటి వాళ్లకు దివ్యౌషధం.. యాలకులు. అవును.. యాలకులు సుగంధ ద్రవ్యాలు అని అందరికీ తెలిసిందే. యాలకులు.. ఎక్కువగా ఇండోనేషియా, నేపాల్, భూటాన్ లలో పండుతాయి. వాటిని ప్రతిరోజు ఏదో విధంగా తీసుకుంటే.. కఫం, దగ్గు, ఇన్ఫెక్షన్, శ్వాస అందకపోవడం లాంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఆస్తమాను కూడా యాలకులతో నయం చేయొచ్చు.

lungs

lungs

యాలకుల్లో ఉండే యాంటీ మైక్రోబియల్ వల్ల శరీరంలో ఇన్ఫెక్షన్ ఏర్పడదు. అలాగే.. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. డిప్రెషన్ ను తగ్గిస్తుంది. అయితే.. యాలకులను రోజూ పరిమితంగానే తీసుకోవాలట. చాలామంది యాలకులను టీ ద్వారా తీసుకుంటారు. అలా టీ ద్వారా తీసుకుంటే రోజూ రెండు కప్పుల యాలకుల టీ తాగితే చాలు. లేదంటే కూరల్లో పోడిగా చేసుకొని వేస్తుంటారు. రోజూ చిటికెడు యాలకుల పొడిని కూరల్లో ఇతర పదార్థాల్లో వేసుకొని తింటే.. పైన చెప్పిన అన్ని రకాల సమస్యలు నయం అవుతాయి.

ఇది కూడా చ‌ద‌వండి ==> మ‌న ఇంట్లో ఉన్న‌వాటితోనే ఇలా రోగ‌నిరోద‌క శ‌క్తి పెంచుకోండి

ఇది కూడా చ‌ద‌వండి ==> Mango Fruit : మామిడి పండ్లు తినగానే ఈ పనులు చేశారంటే కోరి అనారోగ్యాన్ని తెచ్చుకున్నట్టే..!

ఇది కూడా చ‌ద‌వండి ==> మీ బ‌ద్ద‌క‌మే మీ ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది.. ఇలా చేయండి మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే..!

ఇది కూడా చ‌ద‌వండి ==> ఈ టైమ్ లో యాలకులు చేసే మేలు తల్లి కూడా చేయదు.. వెంటనే యాలకులు కొనుక్కొని తినేయండి..!

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది