Zinc : రోగ నిరోధక శక్తిని పెంచే జింక్, విటమిన్స్ ఎక్కువగా ఏ ఫుడ్ లో ఉంటాయంటే..?
Zinc : మన శరీరానికి విటమిన్స్, మినరల్స్, ప్రొటీన్స్.. అన్నీ చాలా అవసరం. అవి లేకుంటే అన్ని రోగాలు ఒకేసారి వస్తాయి. వైరస్ లు అటాక్ చేస్తాయి. శరీరంలో ఏది లోపించినా కూడా ఏదో ఒక ఆరోగ్య సమస్య వస్తూనే ఉంటుంది. అందుకే.. అన్నీ సమపాళ్లలో ఉండాలి. ఇక.. శరీరానికి అతి ముఖ్యమైనవి.. రోగ నిరోధక శక్తిని పెంచేవి.. ఏదైనా వైరస్ శరీరాన్ని అటాక్ చేస్తే.. ఆ వైరస్ బారి నుంచి కాపాడేందుకు ఉపయోగపడే ఇమ్యూన్ సిస్టమ్ ను బూస్ట్ చేసేవి విటమిన్స్, జింక్.
ఇవి శరీరంలో సమపాళ్లలో ఉంటేనే.. రోగ నిరోధక శక్తి ఎక్కువగా పెరుగుతుంది. దాని వల్ల.. కరోనా లాంటి మహమ్మారి నుంచి శరీరానికి పోరాడే శక్తి వస్తుంది. అయితే.. విటమిన్స్, జింక్.. ఎక్కువగా శరీరానికి కావాలంటే.. ఏ ఫుడ్ తినాలో చాలామందికి తెలియదు. అసలు… ఎక్కువ జింక్, ఎక్కువ విటమిన్స్ ఏ ఫుడ్ లో ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం రండి.
Oats – ఓట్స్
ఓట్స్ లో జింక్, విటమిన్స్ ఎక్కువ శాతంలో ఉంటాయి. ఓట్స్ లో మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఓట్స్ ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులను తగ్గించవచ్చు. ఒక సగం కప్పు ఓట్స్ లో 1.5 ఎంజీ జింక్ ఉంటుంది. అలాగే.. ఓట్స్ లో ఫైబర్, బీటా గ్లూకాన్, విటమిన్ బీ6, ఫోలేట్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఓట్స్ క్రమం తప్పకుండా తీసుకుంటే.. శరీరంలో ఉన్న కొలెస్టరాల్ లేవల్స్ ను తగ్గిస్తుంది.
Cashews – జీడిపప్పు
జీడిపప్పు ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలుసు. జీడిపప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల జింక్ అధికంగా లభిస్తుంది. జీడిపప్పును మనం డ్రైఫ్రూట్ గా చెప్పుకుంటాం. ఒక కప్పు జీడిపప్పులో 1.5 ఎంజీల జింక్ ఉంటుంది. అలాగే.. జీడిపప్పులో విటమిన్ ఏ, విటమిన్ కే, కాపర్, ఫోలేట్ యాసిడ్, మంచి కొలెస్టరాల్ ఉంటుంది. జీడిపప్పు ఎక్కువగా తింటే.. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.
Citrus Fruits and Berries – సిట్రస్ ఫలాలు, బెర్రీలు
సిట్రస్ ఫ్రూట్స్ అంటే అందరికీ తెలుసు కదా. పులుపు ఎక్కువగా ఉంటే పండ్లు.. అంటే నిమ్మకాయ, నారింజ, బత్తాయి, కమలం పండ్లు..ఇలా సిట్రస్ పండ్లలో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సీ ఇన్ఫెక్షన్లను తగ్గించేందుకు తీవ్రంగా కృషి చేస్తుంది. అలాగే.. విటమిన్ సీ.. తెల్ల రక్త కణాలను పెంచుతుంది. విటమిన్ సీ అనేది శరీరానికి రోజూ అవసరం ఉంటుంది. ఎందుకంటే.. బాడీకి విటమిన్ సీని స్టోర్ చేసుకునే కెపాసిటీ లేదు. అందుకే క్రమం తప్పకుండా విటమిన్ సీ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకుంటూనే ఉండాలి. పురుషులయితే రోజులో కనీసం 90 ఎంజీల విటమిన్ సీని తీసుకోవాలి. మహిళలకు 75 ఎంజీల విటమిన్ సీ అవసరం ఉంటుంది.
Broccoli and Spinach – బ్రకోలి అండ్ పాలకూర
బ్రకోలిలో చాలా విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. బ్రకోలిలో విటమిన్స్ ఏ, సీ, ఈ ఉంటాయి. అలాగే వీటిలో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. మనకు దొరికే కూరగాయల్లో ఎక్కువ మేలు చేసేది బ్రకోలినే. అలాగే.. పాలకూర కూడా అంతే. పాలకూరలో కూడా విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. దాంట్లో కూడా చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. బీటా కెరొటీన్ ఎక్కువగా ఉంటుంది. అందుకే.. కూరగాయల్లో, ఆకుకూరల్లో బ్రకోలి, పాలకూరను మించింది లేదు.
Oily Fish Tuna and Salmon – ట్యూనా, సాల్మాన్ ఫిష్
చాలామందికి ఫిష్ అంటే చాలా ఇష్టం. ఫిష్ లో న్యూట్రియెంట్స్, ప్రొటీన్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఆయిల్ ఫిష్ లో న్యూట్రియెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సాల్మాన్, ట్యూనా ఫిష్ లను ఆయిలీ ఫిష్ గా పిలుస్తుంటారు. ఇవి ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో ఉండే మినరల్స్, విటమిన్స్, జింక్, ఐరన్, ఇంకా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తాయి.
Yogurt – యోగుర్ట్
పెరుగులాగానే ఉండే ఒక పదార్థం యోగుర్ట్. దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే.. శరీరంలో ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది. యోగుర్ట్ లో ఉండే మంచి బ్యాక్టీరియా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి కావాల్సినంత జింక్ ను యోగుర్ట్ చేకూర్చుతుంది. ఒక కప్పు యోగుర్ట్ లో 1.5 ఎంజీల జింక్ ఉంటుంది. జీర్ణక్రియ మెరుగు పరచడం కోసం, ఇమ్యూనిటీని పెంచడం కోసం యోగుర్ట్ చాలా ఉపయోగపడుతుంది. యోగుర్ట్ లో విటమిన్ డీ కూడా పుష్కలంగా ఉంటుంది. అది ఎముకలను ధృడంగా చేస్తుంది.
Ginger – అల్లం
మన శరీరానికి అల్లం చేసే మేలు తల్లి కూడా చేయదంటారు పెద్దలు. అందుకే.. మనం ప్రతి రోజూ అల్లాన్ని కూరల్లో వాడుతుంటాం. అల్లంలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. అలాగే.. దీంట్లో ఉండే బీటా కెరోటిన్, విటమిన్ సీ.. శరీరానికి కావాల్సినంత ఇమ్యూన్ సిస్టమ్ ను అందిస్తుంది. శరీరానికి కావాల్సినంత యాంటీ ఆక్సిడెంట్స్ ను అల్లం అందిస్తుంది. శరీరంలో మెటబాలిజాన్ని పెంచడంతో పాటు.. రక్తంలో షుగర్ లేవల్స్ ను కూడా అల్లం కంట్రోల్ లో ఉంచుతుంది.