Health Tips : జీవితంలో ఏ రోగము దరిచేరకుండా ఉండాలంటే.. రోజు పరిగడుపున వీటిని తీసుకోండి చాలు…!!
Health Tip : ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలి అని అనుకుంటూ ఉంటారు. ఆరోగ్యంగా ఉండడానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వలన ఇమ్యూనిటీ పెరగటమే కాకుండా దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండగలం. కావున ఎప్పుడు ఆహారపు అలవాట్లపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. రోజు ఉదయం లేచిన వెంటనే ఏం తీసుకోవాలి ఏం తినకూడదు అని విషయాలు పూర్తిగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. కొంతమంది ఉదయం లేచిన వెంటనే ముందు వెనుక ఆలోచించకుండా ఎన్నో రకాల పదార్థాలు తింటూ ఉంటారు. వీటి ప్రభావంగా డైరెక్ట్ గా ఎఫెక్ట్ ఆరోగ్యం పై పడుతుంది.
ఇంకొంతమంది ఉదయం లేచిన తర్వాత చాలా సేపటి వరకు పరిగడుపుతోనే ఉంటారు. ఈ విధంగా చేయడం వలన అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. కావున ఉదయం లేచిన వెంటనే కొన్ని పదార్థాలు తప్పకుండా తీసుకోవాలి. ఎండు ఖర్జూరం :ఎండు ఖర్జూరంలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. మీ శరీరానికి చాలా మేలు చేస్తాయి. రాత్రివేళ నీళ్లలో నానబెట్టి ఉదయం తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవడం వలన శరీరానికి కావాల్సిన ఐరన్ లభిస్తుంది. అలాగే జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. దాంతో పాటు బరువు తగ్గించేందుకు చాలా బాగా సహాయపడుతుంది. కిస్మిస్ లు: కిస్మిస్లు శరీరానికి చాలా ఉపయోగకరమైనది దీనిలో అధిక మొత్తంలో ప్రోటీన్ ఫైబర్ ఐరన్ లాంటివి ఉంటాయి. ఇవి రోజు తినడం వలన శరీరం బలహీనత దూరమవుతుంది.
అలాగే హిమోగ్లోబిన్ పెరుగుతుంది. పరిగడుపున కిస్మిస్ తీసుకోవడం వలన ఇమ్యూనిటీ బలపడుతుంది. అలాగే నిత్యం రాత్రి వేళ ఆరు కిస్మిస్ లు నీటిలో నానబెట్టి పరిగడుపున నీటితో సహా తీసుకోవాలి. బాదం పప్పులు : బాదంపప్పులు శరీరానికి చాలా మేలు చేస్తాయి. ఈ భారంలో పోషక పదార్థాలు అధికంగా ఉంటాయి. దీనిలో అధిక మొత్తంలో ఫైబర్, ప్రోటీన్లు, లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని నిత్యం పరిగడుపున తీసుకుంటే మెమరీ పవర్ పెరుగుతుంది. అలాగే బరువు తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఈ పప్పులను నిత్యం నానబెట్టి పరిగడుపున తీసుకోవడం వలన జీవితంలో ఎటువంటి రోగము దరిచేరదు. ఆనందంగా ఆరోగ్యంగా జీవితాంతం జీవిస్తారు.