Health Tips : ఉడకపెట్టిన గుడ్డుతో కలిపి ఈ ఆహార పదార్థాలను తీసుకుంటున్నారా.. అయితే జాగ్రత్త..
Health Tips : మన శరీరానికి ఆరోగ్యాన్ని కలిగించే ఆహార పదార్థాల్లో మొదటగా ఉండేది గుడ్డు. మనం రోజు ఒక ఉడకబెట్టిన గుడ్డును తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గుడ్లు తక్కువ ధరలోనే మనకు దగ్గరలోనే దొరుకుతూ ఉంటాయి. కోడిగుడ్డులో మన శరీరానికి కావలసిన, పొటాషియం, క్యాల్షియం, ఐరన్, విటమిన్స్, మెగ్నీషియం వంటివి పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా గుడ్లలో శరీరానికి కావాల్సిన శాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్, మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి.ఈ కోడి గుడ్డును బాలింతలు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, మహిళలు తీసుకోవడం వల్ల రక్తహీనత వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు గుడ్డులో ఉండే ఐరన్ కారణంగా ఇది జరుగుతుంది. అంతేకాకుండా ఇందులో క్యాల్షియం కారణంగా ఎముకల అభివృద్ధి జరుగుతుంది.
అలాగే జీవక్రియను మెరుగు పరిచి బరువు తగ్గించడంలో కూడా కోడిగుడ్డు ఉపయోగపడుతుంది. ఇప్పటిదాకా కోడి గుడ్డు తినడం వల్ల కలిగే లాభాలను చూశాము ఇప్పుడు కోడి గుడ్డు తో పాటు వేరే ఆహారపదార్థాలను తీసుకోవడం వల్ల కలిగే సమస్యలను తెలుసుకుందాం..కొంతమంది కోడి గుడ్డు తో పాటు కలిపి వేరే ఆహారపదార్థాలను తింటూ ఉంటారు. కానీ వాటిల్లో కొన్ని కలిపి తీసుకోవడం వల్ల మనం అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి విషయాలను తెలుసుకోవడం కోసం జర్నల్ఆఫ్ న్యూట్రిషన్‌లో జరిపిన ఒక అధ్యయనంలో గుడ్లతో, టీ ని కలిపి తాగడం వల్ల గుడ్లలోని ప్రోటీన్ కంటెంట్ 17 శాతం వరకు తగ్గుతుందని తెలిపింది ఈ అధ్యయనం.టీలో పాలీఫెనాల్స్ అని పిలువబడే సమ్మేళనాలు ఉన్నాయని గ్రహించారు. ఇది గుడ్లలోని ప్రోటీన్‌లకు కట్టుబడి, ప్రోటీన్లు మన శరీరానికి అందకుండా నిరోధిస్తుంది
Health Tips : కోడిగుడ్డు, టీను కలిపి తీసుపోవడం వల్ల వచ్చే సమస్యలు..
. దీని కారణంగా ప్రోటీన్ కు సంబంధించిన అనేక, తలెత్తుతాయట.టీ, కోడిగుడ్డును కలిపి తీసుకోవడం వల్ల మలబద్ధకం వచ్చే అవకాశం ఉంటుంది. గుడ్డులోని ప్రోటీన్ల మన శరీరానికి అందకపోవడం వల్ల చర్మం, జుట్టు, గోర్లు వాటి రంగు మారిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ ప్రోటీన్ లోపం కారణంగా ఎముకల బలహీనత, కండరాల బలహీనత వంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.దీని కారణంగా రోగనిరోధక వ్యవస్థ కూడా తగ్గిపోయి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. టీ తో పాటు గుడ్లను తినటం వల్ల శరీరంలో ఫ్యాటి లివర్ వంటి సమస్యలు ఎక్కువవుతాయి. ఇలాంటి సమస్యలకు దూరంగా ఉండాలి అంటే టీ తో పాటు ఉడకబెట్టిన గుడ్డు, లేదా గుడ్లను తీసుకోకపోవడం చాలా మంచిది.