Health Tips : ఇలా చేశారంటే… గార పట్టిన పళ్ళు తెల్లగా, వజ్రంలా మెరుస్తాయి… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Tips : ఇలా చేశారంటే… గార పట్టిన పళ్ళు తెల్లగా, వజ్రంలా మెరుస్తాయి…

Health Tips : కొంతమందికి పళ్ళు గార పట్టడం, పసుపు పచ్చగా మారడం జరుగుతుంది. చాలామందికి రాత్రి సమయంలో బ్రష్ చేసే అలవాటు లేకపోవడం వలన పళ్ళు రంగు మారడం, గార పట్టడం జరుగుతుంది. అలాగే కొంతమంది పాన్, గుట్కా నమలడం వలన కూడా పళ్ళు గార పట్టడం ,నోటి దుర్వాసన సమస్య వస్తుంది. జాగ్రత్తగా పళ్ళు మొత్తం క్లీన్ అయ్యే విధంగా బ్రష్ చేసినట్లయితే దంత సమస్యలు ఉండవు. పళ్ళు తెల్లగా రావడం కోసం రకరకాల […]

 Authored By aruna | The Telugu News | Updated on :19 August 2022,4:00 pm

Health Tips : కొంతమందికి పళ్ళు గార పట్టడం, పసుపు పచ్చగా మారడం జరుగుతుంది. చాలామందికి రాత్రి సమయంలో బ్రష్ చేసే అలవాటు లేకపోవడం వలన పళ్ళు రంగు మారడం, గార పట్టడం జరుగుతుంది. అలాగే కొంతమంది పాన్, గుట్కా నమలడం వలన కూడా పళ్ళు గార పట్టడం ,నోటి దుర్వాసన సమస్య వస్తుంది. జాగ్రత్తగా పళ్ళు మొత్తం క్లీన్ అయ్యే విధంగా బ్రష్ చేసినట్లయితే దంత సమస్యలు ఉండవు. పళ్ళు తెల్లగా రావడం కోసం రకరకాల టూత్ పేస్ట్ లను వినియోగించకూడదు. పళ్ళు శుభ్రం అయ్యే విధంగా పైకి లోపలికి వెళ్ళే విధంగా జిగ్ జాగ్ గా ఉండే బ్రష్ లను ఉపయోగించాలి. చల్లనివి లేక వేడిగా తాగినప్పుడు పళ్ళు జివ్వుమని అనేవాళ్లు సెన్సిటివ్ టూత్ పేస్ట్ ను ఉపయోగించాలి.

అలాగే చిన్నపిల్లలు పెద్దవాళ్లు ఒకే రకమైన బ్రష్ ఉపయోగించకూడదు. పిల్లల పాల దంతాలు కాబట్టి వారికి చాలా సెన్సిటివ్ పళ్ళు ఉంటాయి. వాళ్లకోసం స్మూత్ గా ఉండే బ్రష్లను ఉపయోగించాలి. స్వీట్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ వంటి తీపి పదార్థాలను తినకూడదు. రాత్రి తిన్న తర్వాత బ్రష్ చేయడం అలవాటు చేసుకోవాలి. పళ్ళ మధ్యలో ఇరుక్కున్న ఆహారం వెంటనే క్లీన్ చేసుకోవాలి. సిట్రస్ ఫుడ్ లను తినకూడదు. ఒకవేళ తింటే వెంటనే నోరు పుక్కిలించాలి. పంటి నొప్పి ఉన్నవారు గోరువెచ్చని ఉప్పు నీళ్లతో పుక్కిలించడం వలన తగ్గుతుంది. మౌత్ వాష్ ఉపయోగించడం వలన నోటి దుర్వాసన సమస్య తగ్గుతుంది. నోట్లో పాచి కూడా తరచూ శుభం చేసుకుంటూ ఉండాలి. మూడు లేదా నాలుగు నెలలకు ఒకసారి బ్రష్ ను మార్చాలి. బ్రష్ చేసిన తర్వాత బ్రష్ గాలికి ఆరే విధంగా పెట్టాలి.

Health Tips these Home remedy for teeth

Health Tips these Home remedy for teeth

ఈ జాగ్రత్తలు పాటిస్తే పళ్లపై ఉండే గార, పచ్చదనం పోతాయి. అలాగే పసుపు, నిమ్మరసం బాగా కలిపి ఈ మిశ్రమాన్ని పెడితే ఒకసారి రుద్ది నోట్లో నీళ్లు పోసి కొని పుక్కిలించినట్లయితే తర్వాత మామూలు పేస్టు తో బ్రష్ చేయడం వలన పళ్ళపై ఉన్న గార పోతుంది. ఒక స్పూన్ జీలకర్ర పొడి, అర స్పూన్ బేకింగ్ సోడా, అర స్పూన్ నిమ్మరసం, కొంచెం నీళ్లు వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని బ్రష్ తో పళ్లపై రుద్ది ఒక పది నిమిషాల పాటు అలాగే ఉండనివ్వాలి. తర్వాత నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలించడం వలన పళ్ళపై ఉండే గార, పసుపు పచ్చదనం పోతాయి. గ్లాస్ నీటిలో పావు స్పూన్ పసుపు వేసి ఆ నీటిని పుక్కిలించడం ద్వారా నోటి దుర్వాసన తగ్గుతుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది