Health Tips : తెల్ల ఉల్లిపాయ మంచిదా… ఎర్ర ఉల్లిపాయ మంచివా… వైద్య నిపుణులు ఏం తెలియజేస్తున్నారంటే.? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Tips : తెల్ల ఉల్లిపాయ మంచిదా… ఎర్ర ఉల్లిపాయ మంచివా… వైద్య నిపుణులు ఏం తెలియజేస్తున్నారంటే.?

Health Tips : ఉల్లి అనగానే ఒక సామెత గుర్తొస్తుంది. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని అందరూ అంటూ ఉంటారు. ఉల్లిపాయ లేని కూర అంటూ ఉండదు. నిత్యం మనం చేసుకునే వంటలలో ఉల్లిపాయ వాడకుండా వంటలు చేయరు. అంత గొప్పది ఉల్లి, ఈ ఉల్లి వలన ఎన్నో ఆరోగ్య ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఈ ఉల్లిని ఆహారంలో చేర్చుకోవడం వలన శరీరంలో ప్రధాన భాగాలకు ఆక్సిజన్ అద్భుతంగా అందుతుంది. అదేవిధంగా కణాల […]

 Authored By aruna | The Telugu News | Updated on :21 August 2022,6:30 am

Health Tips : ఉల్లి అనగానే ఒక సామెత గుర్తొస్తుంది. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని అందరూ అంటూ ఉంటారు. ఉల్లిపాయ లేని కూర అంటూ ఉండదు. నిత్యం మనం చేసుకునే వంటలలో ఉల్లిపాయ వాడకుండా వంటలు చేయరు. అంత గొప్పది ఉల్లి, ఈ ఉల్లి వలన ఎన్నో ఆరోగ్య ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఈ ఉల్లిని ఆహారంలో చేర్చుకోవడం వలన శరీరంలో ప్రధాన భాగాలకు ఆక్సిజన్ అద్భుతంగా అందుతుంది. అదేవిధంగా కణాల వృద్ధికి సహాయపడటంతో పాటు, ఎర్ర రక్త కణాలు కూడా ఉత్పత్తి చేస్తుంది. రక్తం లేనివారికి ఈ ఉల్లిపాయను నిత్యము తీసుకున్నట్లయితే మంచి ఉపయోగకరంగా ఉంటుంది అని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.

అలాగే శరీరంలో ఉన్న అధిక కొవ్వును ఈ ఉల్లి కరిగేలా చేస్తుంది. గుండెకి సంబంధించిన సమస్యలు నుండి రక్షిస్తుంది. హార్ట్ ఎటాక్ రాకుండా రక్షిస్తుంది. అలాగే శరీరంలో నైట్రిక్ యాసిడ్ విడుదల అయ్యేలా చేస్తుంది. అధిక రక్తపోటు లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుంది. అలాగే ఈ ఉల్లిలో అధికంగా కాల్షియం ఉంటుంది. కాబట్టి దీనిని తీసుకోవడం వలన ఎముకలు దృఢంగా మారుతాయి. అదేవిధంగా ఈ ఉల్లిపాయ గుజ్జుని తీసుకొని ఫేస్ కి అప్లై చేయడం వలన ఫేస్ మీద ఉన్న మొటిమలు, వాటి మచ్చలు తొలగిపోయి శాశ్వతంగా రాకుండా చేస్తాయి. అలాగే ముఖం మెరిసిపోతుంది.

Health Tips Which Onions Better For Health

Health Tips Which Onions Better For Health

అదేవిధంగా ఈ ఉల్లి ముక్కలను తినడం వలన దంతాలలో ఉండే చెడు బ్యాక్టీరియా అంతమవుతుంది. ఈ ఉల్లి లో ఉండే ప్రధాన రసాయనాలు క్యాన్సర్ కణాల ఎదుగుదలను ఆపుతాయి. సహజంగా అందరికీ అందుబాటులో ఉండే ఎర్ర ఉల్లిగడ్డలు, తెల్ల ఉల్లి దొరుకుతూ ఉంటాయి. అయితే ఈ ఎర్ర ఉల్లి కంటే తెల్ల ఉల్లి లోనే అధికంగా ఔషధ గుణాలు కలిగి ఉంటాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ తెల్ల ఉల్లిని నిత్యము తీసుకోవడం వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అంటే ఎర్ర ఉల్లి కంటే తెల్ల ఉల్లే మంచిదని తెలియజేస్తున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది