Brain Foods : మెదడు మరింత చురుగ్గా ఉండాలి అంటే… ఈ ఆహారాలను తీసుకోవాలి…
Brain Foods : మన శరీరం పనిచేసేందుకు శక్తి అనేది చాలా అవసరం. అలాగే మన మెదడు కూడా సరిగ్గా పని చేయటానికి సరైన పోషకాహారం కూడా అవసరం. మనం మన మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్య అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే శారీరక ఆరోగ్యంతో పాటుగా మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. నిజం చెప్పాలంటే మెదడు తలలోని పుర్రె ద్వారా రక్షించబడుతుంది. అలాగే ఇది అన్ని జ్ఞానేంద్రియాలకు ముఖ్య కేంద్రంగా కూడా పనిచేస్తుంది. […]
ప్రధానాంశాలు:
Brain Foods : మెదడు మరింత చురుగ్గా ఉండాలి అంటే... ఈ ఆహారాలను తీసుకోవాలి...
Brain Foods : మన శరీరం పనిచేసేందుకు శక్తి అనేది చాలా అవసరం. అలాగే మన మెదడు కూడా సరిగ్గా పని చేయటానికి సరైన పోషకాహారం కూడా అవసరం. మనం మన మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్య అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే శారీరక ఆరోగ్యంతో పాటుగా మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. నిజం చెప్పాలంటే మెదడు తలలోని పుర్రె ద్వారా రక్షించబడుతుంది. అలాగే ఇది అన్ని జ్ఞానేంద్రియాలకు ముఖ్య కేంద్రంగా కూడా పనిచేస్తుంది. మెదడు తనను తాను రిపేర్ చేసుకునే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది అని ఎన్నో అధ్యయనాల్లో తేలింది. అలాగే మన మెదడు అనేది ఎంతో చురుగ్గా ఉండాలి అంటే పోషకాహారాలను ఎక్కువగా తీసుకోవాలి. దీనికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి. జ్ఞాపకశక్తిని పెంచుకునేందుకు రోజు ఎటువంటి ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం…
Brain Foods వాల్ నట్ – వేరుశనగ
ఈ వాల్ నట్స్ లో మేదడుకు మేలు చేసే ఒమేగా త్రీ లాంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. అలాగే ఈ వాల్ నట్స్ ను ప్రతిరోజు తీసుకోవడం వలన జ్ఞాపకశక్తి అనేది ఎంతో మెరుగుపడుతుంది. అంతేకాక వేరుశనగపప్పు కూడా మెదడుకు ఎంతో బాగా పనిచేస్తుంది అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకు అంటే వాటిలలో మంచి కొవ్వులు మరియు ప్రోటీన్లు ఎక్కువ మోతాదులో ఉంటాయి…
బీన్స్ – గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ : బీన్స్ లో ఫైబర్ మరియు విటమిన్ బి, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఏకాగ్రత మరియు జ్ఞాపక శక్తిని పెంచడంలో కూడా హెల్ప్ చేస్తాయి. అలాగే ఆకుకూరలలో విటమిన్ ఇ మరియు ఫోల్లెట్ సమృద్ధిగా ఉంటాయి. ఇది మెదడు అభివృద్ధికి ఎంతో హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే కాలీఫ్లవర్ మరియు బ్రోకలీ మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఈ కూరగాయలలో కోలిన్ అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది జ్ఞాపకశక్తిని ఎంతో బలంగా చేస్తుంది. అలాగే ఆలోచన సామర్థ్యానికి కూడా పదును పెడుతుంది…
బ్లూ బెర్రీ : మెదడు ఆరోగ్యానికి బ్లూ బెర్రీలు అనేవి చాలా మంచివి. ఇవి మెదడు జ్ఞాపకశక్తిని కోల్పోకుండా చేయటమే కాకుండా నరాల పనితీరు మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచడంలో కూడా హెల్ప్ చేస్తుంది…
కాఫీ,టీ : వీటిలో ఉండే కేఫిన్ అనేది మెదడుకు పదును పెట్టి అలసటను నియంత్రిస్తుంది. అలాగే గ్రీన్ టీ అనేది మానసిక ఆరోగ్యానికి కూడాఎంతో ప్రభావంతంగా ఉంటుంది. కానీ దీని అధిక వినియోగం కూడా అంత మంచిది కాదు…