Diabetes : మధ్యాహ్నం ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే ..అదుపులో మధుమేహం..
Diabetes : డయాబెటిస్ బారిన పడుతున్న వారు సంఖ్య ఏటా పెరుగుతున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే మధుమేహం బారిన పడ్డ వారు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. డయాబెటిస్ పేషెంట్స్ కంపల్సరీగా తాము తీసుకునే ఫుడ్ ఐటమ్స్ పట్ల జాగ్రత్తలు వహించాలని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. లేదంటే వారి ఆరోగ్యంపైన ప్రభావం పడే చాన్సెస్ ఉన్నాయి. ప్రతీ రోజు వారు తీసుకునే ఆహార పదార్థాలతో షుగర్ లెవల్స్ పెరిగే ప్రమాదముంటుంది. కాబట్టి తీసుకునే ఆహార పదార్థాల పట్ల జాగ్రత్తలు వహించాలి. ఈ క్రమంలోనే డయాబెటిస్ పేషెంట్స్ కంపల్సరీగా హెల్త్ ఎక్స్ పర్ట్స్ సూచించిన ఫుడ్ ఐటమ్స్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యంగా మధ్యాహ్నం పూట తీసుకునే ఆహార పదార్థాలపై శ్రద్ధ వహించాలి. వారు ఆఫ్టర్ నూన్ టైమ్స్‌లో ఏ ఫుడ్ తీసుకోవాలో తెలుసుకుందాం.డయాబెటిస్ ఉన్న పేషెంట్స్ కంపల్సరీగా ఆఫ్టర్ నూన్ టైమ్స్‌లో ఈ ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి. అవేంటంటే..ఆకుకూరలు.. వీటిని కంపల్సరీగా మధ్యాహ్న సమయంలో తీసుకోవాలి. మెంతికూర, పాలకూర, బ్రోకలీ, గోరింటాకు, చేదుకాయ, తోరాయి వంటివి తీసుకోవచ్చు. వీటిలో కేలరీలు తక్కువ ఉన్నప్పటికీ శక్తి, పోషకాలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా హెల్త్‌కు చాలా కావల్సినవి.ఆకు కూరల్లో ఉండే విటమిన్ సి హెల్త్ కు కంపల్సరీ కావాల్సిన విటమిన్.
Diabetes : ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం..
టైప్ 2 డయాబెటిస్ పేషెంట్స్‌కు ఆకుకూరలు చాలా ఉపయోగపడతాయి.ఇకపోతే మధుమేహం బారిన పడిన వారు తమ రోజు వారీ భోజనంలో ముఖ్యంగా మధ్యాహ్న వేళలో పప్పులను చేర్చుకోవాలి. పప్పులో ఉండే ప్రోటీన్స్ హెల్త్‌కు చాలా మంచివి. ఇందులో ఉండే మినరల్స్.. హెల్త్‌కు చాలా అవసరమైనవి. గుడ్డు, పెరుగు, ఫ్యాటీ ఫిష్‌ను కూడా మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ప్రతీ రోజు గుడ్డు తీసుకోవడం వలన షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. ఇక కర్డ్, ఫిష్ తీసుకోవడం ద్వారా హ్యూమన్ బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది.