Hair Growth Juices : ఈ జ్యూస్ తాగితే రాలిన వెంట్రుక‌ల స్థానంలో కొత్త వెంట్రుక‌లు ఇట్టే వ‌చ్చేస్తాయి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hair Growth Juices : ఈ జ్యూస్ తాగితే రాలిన వెంట్రుక‌ల స్థానంలో కొత్త వెంట్రుక‌లు ఇట్టే వ‌చ్చేస్తాయి..!

Hair Growth Juices : ఈ రోజుల్లో జుట్టు స‌మ‌స్య వ‌ల‌న చాలా మంది బాధ‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. మ‌గ‌వారు, ఆడ‌వారు జ‌ట్టు స‌మ‌స్య‌తో చాలా ఆవేద‌న చెందుతున్నారు. జుట్టు ఆరోగ్యంగా, హెల్దీగా పెరగాలని అందరికీ ఉంటుంది. కానీ, ఆ కల నెరవేరడం కాస్తా కష్టం. కాబట్టి, జుట్టు పెరుగుదలకి వీలయ్యే పోషకాలు తీసుకోవడం వ‌ల‌న ల‌బ్ధి చేకూరుతుంది. జుట్టు కోసం కొందరు విటమిన్ టాబ్లెట్లు కూడా వాడతారు. కానీ ప్రతి చిన్న దానికి మెడిసిన్‌ […]

 Authored By ramu | The Telugu News | Updated on :4 May 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Hair Growth Juices : ఈ జ్యూస్ తాగితే రాలిన వెంట్రుక‌ల స్థానంలో కొత్త వెంట్రుక‌లు ఇట్టే వ‌చ్చేస్తాయి..!

Hair Growth Juices : ఈ రోజుల్లో జుట్టు స‌మ‌స్య వ‌ల‌న చాలా మంది బాధ‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. మ‌గ‌వారు, ఆడ‌వారు జ‌ట్టు స‌మ‌స్య‌తో చాలా ఆవేద‌న చెందుతున్నారు. జుట్టు ఆరోగ్యంగా, హెల్దీగా పెరగాలని అందరికీ ఉంటుంది. కానీ, ఆ కల నెరవేరడం కాస్తా కష్టం. కాబట్టి, జుట్టు పెరుగుదలకి వీలయ్యే పోషకాలు తీసుకోవడం వ‌ల‌న ల‌బ్ధి చేకూరుతుంది. జుట్టు కోసం కొందరు విటమిన్ టాబ్లెట్లు కూడా వాడతారు. కానీ ప్రతి చిన్న దానికి మెడిసిన్‌ వాడడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. అందుకే మెడిసిన్ కి బదులుగా కొన్ని నేచురల్ డ్రింక్స్ తో హెయిర్ ఫాల్‌ ను తగ్గించుకోవచ్చు. క్యారెట్, పాలకూర కలిపి జ్యూస్‌ చేసి కుదుళ్లకు రాస్తే జుట్టు రాల‌డం వారంలోనే త‌గ్గిపోతుందని నిపుణులు అంటున్నారు. క్యారెట్, పాలకూర లో ఉండే పోషకాలు కుదుళ్లను బలంగా మారుస్తాయి

Hair Growth Juices : ఇలా చేస్తే మీ జుట్టు రాల‌దు..

అలోవెరా జ్యూస్ చర్మ సమస్యలే కాకుండా జుట్టు రాలే స‌మ‌స్య‌ని కూడా ప‌రిష్క‌రిస్తుంది. ఈ డ్రింక్ రెగ్యుల‌ర్‌గా తీసుకోవ‌డం వ‌ల‌న జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం ప్రతిరోజూ ఉసిరి, కరివేపాకు, అల్లం కలిసిన జ్యూస్‌ను తాగితే నెల రోజుల్లోనే మీకు మంచి ఫలితం కనిపిస్తుంది. మీరు ఎంత జుట్టును కోల్పోయారో దానికి రెట్టింపు జుట్టును మీరు త్వరగా పొందుతారు. ఇక జుట్టు రాలే స‌మ్య‌ల‌కి పెప్పర్‌మింట్ టీ ఎంతో మేలు చేస్తుంది. ఈ టీలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి కాబ‌ట్టి స్కాల్ప్‌ను బ్యాక్టీరియా, ఫంగస్ నుంచి రక్షించి జుట్టు పెరుగుదలను ప్రోత్స‌హిస్తుంది. చియా గింజలు, అవిసె గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, గుమ్మడి గింజలు, తామర గింజలను చిన్న సెగ‌పై వేయించి ఆ తర్వాత పొడి చేసుకోవాలి. ఆ త‌ర్వాత నాన‌బెట్టిన బాదం, ఖర్జూరం నీళ్లలో గింజల పొడిని కలిపి తాగితే జుట్టు సంబంధిత స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.

Hair Growth Juices ఈ జ్యూస్ తాగితే రాలిన వెంట్రుక‌ల స్థానంలో కొత్త వెంట్రుక‌లు ఇట్టే వ‌చ్చేస్తాయి

Hair Growth Juices : ఈ జ్యూస్ తాగితే రాలిన వెంట్రుక‌ల స్థానంలో కొత్త వెంట్రుక‌లు ఇట్టే వ‌చ్చేస్తాయి..!

తులసి ఆకుతో తయారు చేసిన జ్యూస్ కూడా మంచి ఫలితాన్ని అందిస్తుంది. చెంచా సోంపు గింజలను గ్లాసుడు నీటిలో వేసి, రాత్రంతా నానబెట్టాలి. త‌ర్వాత అందులో తులసి ఆకుల రసాన్ని కలుపుకుని తాగితే జుట్టు ధృడంగా ఉంటుంది. నారింజ రసం, ఉసిరి రసం, బీట్‌రూట్ రసం, చియా గింజలను కొబ్బరి నీళ్లలో కలుపుకొని వారానికి 3 నుంచి 4 రోజులు ఈ పానీయం తీసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులోని విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంచుతాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది