Health Tips : ఉలవల్లో ఇన్ని పోషకాలా? మాంసం కంటే ఎక్కువ ప్రయోజనాలు..
Health Tips : మనలో చాలా మంది మాంసం అంటే తెగ ఇష్టంగా తింటుంటారు. అదే సండే వచ్చిందంటే ప్రతి ఇంట్లో మసాలాలు ఘుమఘుమలు వస్తుంటాయి. కొందరు బిర్యాని చేసుకుంటే మరి కొందరు చికెన్, మటన్, ఫిష్ లాంటి కూరలు వండుకుంటారు. ఇక ఎదైనా ఫంక్షన్ చేస్తే మాంసంతో చేసే వెరైటీలకు కొదవే ఉండదు. ఇదిలా ఉండగా మనలో చాలా మంది చిరుధాన్యాలు తినేందుకు ఇష్టపడరు. కొందరు మాత్రం ఆరోగ్య ప్రయోజనాల కోసం వీటిని తప్పక తింటుంటారు. ఇక ఉలవలు అనే పేరు వినడమే కానీ ప్రస్తుత తరానికి వీటి గురించి తెలియదు. వీటిని తినిడానికి సైతం ఇష్టపడరు.
కానీ మాంసం కంటే ఉలవల్లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. వీటితో కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు.పప్పు దినుసుల్లో మాంసం కంటే ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఇందులో మొదటి వరుసలో ఉండేది ఉలవలు. ఇవి ముదరు గోధుమ రంగులో ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యం మెరగవుతుంది. అనారోగ్య సమస్యలు దూరమవుతాయని చెబుతున్నారు నిపుణులు. వీటిని తినడం వల్ల మూత్రపిండాల్లోని రాళ్లు శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయట. మూత్రపిండాల్లోని రాళ్లను పగలగొట్టడంలో ఇవి చాలా వరకు సహాయపడతాయి. ఇక మధుమేహంతో బాధపడుతుండే వారు వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవాలి.
Health Tips : ఎన్నో లాభాలు
దీని వల్ల బాడీలో చెక్కెర స్థాయిలో నియంత్రణలో ఉంటాయి. పురుషులలో స్పెర్మ్‌కౌంట్ పెంచడంలో ఇవి చాలా ఉపయోగపడతాయి. బరువు తగ్గాలనుకునే వారు వీటిని తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఇందులో కార్బోహైడ్రేట్లు తక్కువగా, ప్రోటీన్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. బలహీనంగా ఉన్న వారు వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఎందుకంటే వీటిలో పాస్సరస్, కాల్షియం, ప్రొటీన్, ఐరన్ లాంటివి ఎక్కువగా ఉంటాయి. శరీరంలో రక్తం తక్కువగా ఉన్న వారు వీటిని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండాలి.