Weight Loss : వేగంగా బరువు తగ్గాలా? వ్యాయామానికి 30 నిమిషాల ముందు ఈ పని చేస్తే చాలు..!
Weight Loss : చాలామంది ప్రపంచ వ్యాప్తంగా ఒబెసిటీతో బాధపడుతున్నారు. ఒబెసిటీ అంటే ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువగా ఉండటం. ప్రపంచం మొత్తం మీద ప్రతి పది మందిలో ఐదు నుంచి ఆరుగురిని ఈ ఒబెసిటీ వేధిస్తోంది. బరువు ఎక్కువగా ఉండటం వల్ల ఏ పనీ సరిగ్గా చేయలేరు. కాసేపు నడవలేరు. ఎక్కువ సేపు కూర్చొని పని చేయలేరు. అలాగే ఆరోగ్య సమస్యలు.. ఇలా బరువు ఎక్కువగా ఉండటం వల్ల సమస్యలే ఎక్కువ. అందుకే చాలా మంది బరువు తగ్గడం కోసం చాలా కష్టపడుతుంటారు. వ్యాయమాలు, కసరత్తులు తెగ చేస్తుంటారు. అయినా కూడా కొందరికి ఫలితం ఉండదు. బరువు అస్సలు తగ్గరు. ఊబకాయంతో బాధపడుతూనే ఉంటారు. ఫుడ్ ను కంట్రోల్ చేసుకున్నా కూడా కొందరు అయితే అస్సలు బరువు తగ్గరు. దీంతో వాళ్లకు ఏం చేయాలో పాలుపోదు.
అయితే.. వెంటనే బరువు తగ్గాలని.. వేగంగా బరువు తగ్గాలని అనుకునే వాళ్లు.. ఒక చిన్న పని చేయాలి. వ్యాయామం చేయాడానికి ఒక 30 నిమిషాల ముందు ఒక పని చేసి.. కసరత్తులు ప్రారంభిస్తే.. వేగంగా బరువు తగ్గుతారు. ఇది నిరూపించబడింది కూడా. అయితే.. వ్యాయామానికి 30 నిమిషాల ముందు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం రండి.
Weight Loss : ఒక స్ట్రాంగ్ కాఫీ తాగండి.. అంతే
మీరు రోజూవారి వ్యాయామం చేయడానికి ముందు.. కనీసం 30 నిమిషాల ముందు మీ కడుపులో ఒక స్ట్రాంగ్ కాఫీ పడాలి. దాని వల్ల.. ఏమౌతుందంటే… కాఫీ తాగిన 30 నిమిషాల తర్వాత వ్యాయామం ప్రారంభించడం వల్ల.. అదనపు కేలరీలు కూడా ఖర్చు అవుతాయి. దీంతో వేగంగా బరువు తగ్గుతారు. దీంతో త్వరగా సన్నబడే అవకాశం ఉంటుంది.
అయితే.. బరువు తగ్గడానికి, కాఫీకి ఏంటి సంబంధం అంటారా? ఒక కప్పు స్ట్రాంగ్ కాఫీ తాగి.. వ్యాయామం ప్రారంభిస్తే.. శరీరంలో ఉండే కొవ్వును కరిగించే యాంటీ ఆక్సిడెంట్ల చర్య పెరుగుతుంది. దాని వల్ల కొవ్వు తొందరగా కరుగుతుందట. దీన్ని రీసర్చ్ చేసి మరీ నిరూపించారు పరిశోధకులు. కాకపోతే.. తాగే కాఫీ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. అంటే.. కనీసం 3 మిల్లీగ్రాముల కెఫిన్ ఒక్క కప్పు కాఫీలో ఉండేలా చూసుకోవాలి. ఆ కాఫీలో చక్కెరను తక్కువగా వేసుకోవాలి. బ్లాక్ కాఫీ అయితే ఇంకా బెటర్ అని పరిశోధకులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి ==> ప్రొటీన్స్ ఎక్కువగా ఏ ఫుడ్ లో ఉంటాయి? ప్రొటీన్ ఫుడ్ ఎక్కువగా తింటే కలిగే లాభాలు ఏంటి?
ఇది కూడా చదవండి ==> పచ్చి బఠాణీలలో ఇన్ని పోషకాలు ఉన్నాయా? వీటిని తినడం వల్ల ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు..!
ఇది కూడా చదవండి ==> నిత్యం పెసలు తింటే కలిగే లాభాలు తెలిస్తే మీరు అస్సలు వదిలిపెట్టరు..!
ఇది కూడా చదవండి ==> అన్ని వంట నూనెలు పక్కన పెట్టి.. కొబ్బరి నూనెను ఆహారంలో వాడి చూడండి.. రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు..!