Health Benefits : రాత్రి సమయంలో కాళ్లు కడుక్కొని పడుకోవడం వలన ఇన్ని ప్రయోజనాలా…!
Health Benefits : ప్రస్తుతం మనం జీవిస్తున్న గజిబిజి లైఫెలో రాత్రి పడుకునే సమయంలో ఆహారాన్ని లేటుగా తిని వెంటనే పడుకుంటూ ఉంటారు.. అలా చేయడం వలన ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది.అలాగే నిద్రలేమి సమస్యతో చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే రాత్రి పడుకునే సమయంలో కాళ్లు కడుక్కొని పడుకోవాలి అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు..
రోజంతా పనిచేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి సమయంలో పడుకునే ముందు కాళ్ళను కడగడం చాలా అవసరం. కానీ అలా చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు. రోజు పడుకునే ముందు కాళ్లు కడుక్కొని పడుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం…
ప్రతిరోజు పడుకునే సమయంలో కాళ్ళను కడిగి పడుకోవడం వలన కాళ్లు దృఢత్వం పెరుగుతుంది. కాళ్ల నొప్పి, తిమ్మిర్లు కూడా తగ్గుతాయి. పడుకునే ముందు మీ పాదాలను కడుక్కోవడం వల్ల చాలా మేలు జరుగుతుంది. పాదాలలో నొప్పి ఎక్కువగా ఉంటే పాదాలను కడుక్కొని పడుకోవాలి. దీంతో మనసు ప్రశాంతంగా ఉండి మంచి నిద్ర పడుతుంది. రాత్రి పడుకునే సమయంలో పాదాలు కడుక్కోవడం చాలా ముఖ్యం. కాళ్లు కు ఎక్కువగా చెమట పట్టే వారి హైడ్రోస్ అంటారు. అటువంటి వ్యక్తి రాత్రి సమయంలో కాళ్లు కడుక్కొని పడుకోవాలి. ఇలా చేయడం వలన మీ పాదాలలో బ్యాక్టీరియా పెరగకుండా చేస్తుంది.
చల్లని లేదా గోరువెచ్చని నీటితో మీ కాళ్ళని కడుక్కోవచ్చు.. ఒక డబ్ లో నీటిని తీసుకొని దాంట్లో కొన్ని నిమ్మకాయ ముక్కలను వేసి దానిలో మీ కాళ్ళను కొద్దిసేపు ఉంచుకోవాలి. కొద్దిసేపు పాటు ఉంచిన తర్వాత మీ కాళ్ళను బయటికి తీసి తడి ఆరిన తర్వాత ఆయిల్ అప్లై చేయాలి. ఇలా చేయడం వలన మీ కాళ్లకు మంచి ఉపశమనం కలుగుతుంది. వేడిగా ఉన్న వారి పాదాలు కచ్చితంగా రాత్రి సమయంలో పడుకునే ముందు కాళ్ళను కడుక్కొని పడుకోవాలి. ఇలా చేయడం వలన ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది..