Acidity : మీరు ప్రతిరోజు ఈ చిట్కాలు పాటిస్తే చాలు… అసిడిటీ సమస్యలకు ఈజీగా చెక్ పెట్టచ్చు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Acidity : మీరు ప్రతిరోజు ఈ చిట్కాలు పాటిస్తే చాలు… అసిడిటీ సమస్యలకు ఈజీగా చెక్ పెట్టచ్చు…?

 Authored By ramu | The Telugu News | Updated on :6 October 2024,6:00 am

ప్రధానాంశాలు:

  •  Acidity : మీరు ప్రతిరోజు ఈ చిట్కాలు పాటిస్తే చాలు... అసిడిటీ సమస్యలకు ఈజీగా చెక్ పెట్టచ్చు...?

Acidity : పండగల సీజర్ వచ్చింది అంటే చాలు విందు భోజనాలకు పెట్టింది పేరు. అయితే కొంతమందికి కొద్దిగా తిన్న సరే జీర్ణక్రియలో ఆటంకం అనేది ఏర్పడి కడుపుకు సంబంధించిన సమస్యలు వచ్చి పడతాయి. దీనివలన శరీర అసౌకర్యం మరియు గుండెల్లో మంట కూడా స్టార్ట్ అవుతుంది. అయితే హఠాత్తుగా వచ్చే ఈ సమస్యల నుండి మీరు ఉపశమనం పొందాలి అంటే ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలను పాటించండి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే అవి ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…

కడుపు నొప్పికి మరియు జీర్ణ క్రియకు ఉత్తమమైన మార్గం అల్లం. అయితే ఈ అల్లం ఘాటు అనేది జీర్ణ క్రియ సమస్యలను ఈజీగా తొలగిస్తుంది. అలాగే అల్లం రసంలో కొద్దిగా తేనెను కలుపుకొని ప్రతిరోజు రెండు లేక మూడు గ్లాసులు తాగితే చాలు జీర్ణ సమస్యలు అనేవి మీ దరి చేరకుండా ఉంటాయి. అలాగే మీరు సాధారణ టీకి బదులుగా అల్లం టీ తాగేందుకు ప్రయత్నం చేయండి. మీరు గనక రోజు ఇలా చేస్తే కొద్ది రోజులలోనే మీకు మంచి ఫలితం లభిస్తుంది. అలాగే జీర్ణ చికిత్సలో ఇంగువ మరియు సోంపు కూడా ఎంతో చక్కగా పనిచేస్తాయి. అయితే వీటిని నీళ్లలో ఒకటి స్పూన్ ఇంగువ మరియు 1/4 టి స్పూన్ సోంపు వేసుకుని బాగా మరిగించాలి. అవి బాగా మరిగిన తరువాత కప్పులో పోసుకొని వేడివేడిగా తాగితే జీర్ణ సమస్యలనేవి ఇట్టే తొలగిపోతాయి…

Acidity మీరు ప్రతిరోజు ఈ చిట్కాలు పాటిస్తే చాలు అసిడిటీ సమస్యలకు ఈజీగా చెక్ పెట్టచ్చు

Acidity : మీరు ప్రతిరోజు ఈ చిట్కాలు పాటిస్తే చాలు… అసిడిటీ సమస్యలకు ఈజీగా చెక్ పెట్టచ్చు…?

మీరు ప్రతిరోజు ఆహారంలో కచ్చితంగా పెరుగును చేర్చుకోవాలి. మీరు ప్రతిరోజు పెరుగును గనుక తీసుకుంటే మంచి బ్యాక్టీరియా అనేది పేగుల్లో చేరి జీర్ణక్రియను క్రమబద్ధీకరిస్తుంది. అలాగే పెరుగు అనేది కడుపును చల్లగా కూడా ఉంచుతుంది. అయితే చాలా మందికి లాక్టోజ్ అలర్జీ అనే సమస్య ఉంటుంది. అయితే ఇలాంటి వారు పాలు లేక పాల ఉత్పత్తులను తీసుకోవడం వలన శరీరంపై దద్దుర్లు అనేవి వస్తాయి. ఈ సమస్య ఉన్నవారు పెరుగును తినకుండా ఉండటమే మంచిది. అలాగే మీరు ప్రతిరోజు పుదీనా ఆకులను పచ్చిగా నమిలి తీసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ ఏదైనా సమస్య గనక మీకు ఉన్నట్లయితే దీనికి పరిష్కారంగా పుదీనా టీ తాగితే మంచిది. అయితే ఈ టీ కోసం కొన్ని పుదీనా ఆకులను నీళ్లలో వేసి బాగా మరగబెట్టుకొని వడపోసి కప్పులో పోసుకుని తాగితే కడుపు ఆరోగ్య ఎంతో బాగుంటుంది…

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది