Cauliflower Rice : కాలీఫ్లవర్ తో మసాలా రైస్ ని ఇలా చేయండి… రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Cauliflower Rice : కాలీఫ్లవర్ తో మసాలా రైస్ ని ఇలా చేయండి… రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం…!!

 Authored By ramu | The Telugu News | Updated on :8 October 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Cauliflower Rice : కాలీఫ్లవర్ తో మసాలా రైస్ ని ఇలా చేయండి... రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం...!!

Cauliflower Rice : కాలీఫ్లవర్ అంటే చాలు చాలా మంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే దీనితో చాలా రకాల వంటలు కూడా తయారు చేసుకోవచ్చు. ఇది ఎంతో రుచిగా కూడా ఉంటుంది. అయితే ఇది క్రూసిఫర్ జాతికి చెందిన కూరగాయలలో కాలీఫ్లవర్ కూడా ఒకటి. అలాగే కాలీఫ్లవర్ తో చేసే వంటకాలలో మసాలా రైస్ కూడా ఒకటిగా చెప్పొచ్చు. అలాగే దీని పక్కన రైతా పెట్టుకుని తింటే మరింత రుచిగా ఉంటుంది. మీ లంచ్ బాక్స్ లో కి డిఫరెంట్ గా కావాలి అనుకుంటే ఈ రైస్ ను కూడా లంచ్ బాక్స్ లో పెట్టుకోవచ్చు. ఈ రైస్ ని చేయటం కూడా చాలా తేలిక. అయితే గోబీ రైస్ కూడా చాలా ఫేమస్. అయితే కాలీఫ్లవర్ లో పురుగులు ఉంటాయి అనే ఉద్దేశంతో కొంతమంది దీనిని తినరు. కానీ వేడి నీటిలో వీటిని శుభ్రంగా కడిగినట్లయితే ఎలాంటి పురుగులు ఉండవు.

అలాగే ఈ రైస్ ను పండగలు మరియు స్పెషల్ డేస్ లో కూడా ప్రిపేర్ చేసి అతిథులకు పెట్టొచ్చు. అది తిన్న తర్వాత అందరూ కూడా మీ ఫ్యాన్స్ అవుతారు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటి.? దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాలీఫ్లవర్ రైస్ కు కావలసిన పదార్థాలు : కాలీఫ్లవర్, బియ్యం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, పచ్చి బఠానీలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, గరం మసాలా, పుదీనా, బిర్యానీ దినుసులు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, నూనె, నెయ్యి.

తయారీ విధానం : మీరు ముందుగా కాలీఫ్లవర్ ను పురుగులు లేని దానిని తీసుకోండి. ఆ తర్వాత వీటిని కట్ చేసుకొని వేడి నీటిలో కొద్దిగా ఉప్పు,పసుపు వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత బియ్యం కడుక్కొని అన్నాన్ని వండి పెట్టుకోండి. ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని దానిలో కొద్దిగా నెయ్యి మరియు నూనె వేసి వేడి చేసుకోవాలి. ఈ నూనె వేడి అయిన తర్వాత దీనిలో కొద్దిగా బిర్యానీ దినుసులు వేసి అవి కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు ఉల్లిపాయలు,పచ్చిమిర్చి వేసి అవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చి పటానీలు, పుదీనా తరుగు, కరివేపాకు కూడా వేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత వీటిలోనే కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి.

Cauliflower Rice కాలీఫ్లవర్ తో మసాలా రైస్ ని ఇలా చేయండి రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం

Cauliflower Rice : కాలీఫ్లవర్ తో మసాలా రైస్ ని ఇలా చేయండి… రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం…!!

ఈ కాలీఫ్లవర్ ముక్కలను ఒక ఐదు నిమిషాల పాటు వేగిన తర్వాత సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, జీలకర్ర పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత వీటన్నిటిని ఒక రెండు నిమిషాల పాటు సన్నని మంటపై వేయించాలి. ఆ తర్వాత ముందుగా మనం వండి పెట్టుకున్న అన్నాన్ని కూడా దానిలో వేసి బాగా కలుపుకోవాలి. చివరిలో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే కాలీఫ్లవర్ మసాలా రైస్ రెడీ…

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది