TEA Powder : మిగిలిన టీ పౌడర్ ను పారేస్తున్నారా… దానిలో ఉన్న రహస్యం తెలిస్తే షాక్ అవుతారు…!!
TEA Powder : సహజంగా చాయ్ చేసిన తర్వాత దానిని వడకట్టగా మిగిలిన టీ పౌడర్ ను పారేస్తూ ఉంటాము.. అయితే ఈ పడేసిన దాంట్లో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు..సహజంగా టీ అంటే అందరూ ఇష్టపడి తాగుతూ ఉంటారు.. నిత్యం నాలుగైదు సార్లు టీ తాగేవాళ్లు మనలో కూడా చాలామంది ఉంటారు. టీ ఆకుల వాడకం అధికంగానే ఉంటుంది సాధారణంగా టీ తయారుచేసిన టీ ఆకులను పడేస్తూ ఉంటారు. చెత్తగా మీరు పడేస్తున్న ఈ టీ ఆకుల్లో చాలా సహాయకరమైన విషయాలు ఉన్నాయి. టీ తయారుచేసిన తర్వాత మిగిలిన టి పౌడర్ ను మీరు ఎంత ప్రయోజనాల కోసం వాడుకోవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం.. మిగిలిపోయిన చాయ్ పత్తి ఎలా వినియోగించాలి.. *ఈగలను తరిమి కొట్టడానికి: మిగిలిన చాయ్ పత్తి సహాయంతో మీరు ఇంట్లో ఈగలను తరిమికొట్టవచ్చు. దీనికోసం మీరు ముందుగా మిగిలిన టీ పౌడర్ ను మరగబెట్టాలి. తర్వాత ఈ నీటిలో ఈగలు ఉన్న ప్రదేశాన్ని తుడుచుకోవాలి.
ఈ విధంగా చేయడం వల్ల ఈగలు ను తరిమికొట్టవచ్చు..*వం టగది బాక్స్లను శుభ్రపరచడం : వంట గదిలో ఉన్న పాత పెట్టల నుంచి వాసన వస్తుంటే మీరు వాటి వాసనను తొలగించడానికి ఈ చాయ్ పత్తిని వాడవచ్చు. దానికోసం ముందుగా మిగిలిన చాయ్ పత్తిని బాగా మరగబెట్టాలి. తర్వాత ఆ బాక్స్లను అదే నీటిలో నానబెట్టాలి. ఈ విధంగా చేయడం వల్ల బాక్సులు నుంచి వచ్చే వాసన పోతుంది.. *మొక్కలకు పోషణ: చాలామంది ఇంట్లో మొక్కలు నాటడానికి ఇష్టపడతారు. అయితే కొన్నిసార్లు కొన్ని కారణాలవల్లే వాటిని జాగ్రత్తగా చూసుకోలేరు. దాని వలన సరైన పోషకాహారం తీసుకోకపోవడం వలన అవి చనిపోతూ ఉంటాయి. మొక్కలను పోషించడానికి మీరు మిగిలిన ఈ చాయ్ పత్తి నీ మొక్కలకు ఎరువుగా వేసుకోవచ్చు.. *మళ్లీ వాడవచ్చు: మిగిలిన టీ ఆకులను మళ్లీ వినియోగించవచ్చని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దీనికోసం ముందుగా మిగిలిన టీ ఆకులను బాగా కడిగి ఎండలో ఆరబెట్టాలి.
తర్వాత వాటిని గాలి చొరబడని బాక్సులు భద్రపరుచుకోవాలి. మీరు ఈ టీ ఆకులను మళ్ళీ టీ చేయడానికి కూడా వాడుకోవచ్చు.. *గాయాలు మానిపోతాయి: టీ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. శరీర గాయాలను తగ్గించడానికి దీనిని వాడుకోవచ్చు. ముందుగా మిగిలిన టీ ఆకులను శుభ్రం చేసి తర్వాత నీటిలో వేసి మరిగించి చల్లారిన తర్వాత గాయం పై నెమ్మదిగా రుద్దాలి. కొంత సమయం తర్వాత శుభ్రమైన నీటితో గాయాన్ని కడగాలి ఈ చిట్కా గాయాలను తొందరగా నయం చేయడానికి ఉపయోగపడుతుంది. *నూనె పాత్రలను శుబ్రపరచడానికి: కొన్ని పాత్రలను చాలాసార్లు కడిగినప్పటికీ వాటికి ఉన్న జిడ్డు అసలు పోదు. దానిని తొలగించడానికి మీరు మిగిలిన ఈ ఆకులను వాడవచ్చు. నూనె పాత్రలు శుభ్రం చేయడానికి మిగిలిన టీ ఆకులను బాగా మరిగించి ఆపై వాటిని శుభ్రం చేసుకోవాలి..