Urination : పదేపదే యూరిన్ వస్తుందా… అయితే ఈ వ్యాధి కావచ్చు.. అలర్ట్ గా ఉండండి..!!
Urination : ప్రస్తుతం ఉన్న కాలంలో వయసు తరహా లేకుండా ఎన్నో వ్యాధులు చుట్టుముడుతున్నాయి. అలాంటి వ్యాధులలో ఒకటి పదేపదే యూరిన్ రావడం. మీరు యూరిన్ కిఎక్కువగా వెళుతూ ఉంటే.. ఈ దీర్ఘకాలిక సమస్య అయ్యి ఉండవచ్చు. అలాగే ప్రమాదకరమైన అనారోగ్యం రావడానికి ఇది సంకేతం అవుతుంది. ఒక మనిషి రోజులో ఎనిమిది సార్లు మూత్ర విసర్జన కి వెళ్ళవచ్చు. అది కాస్త ఎక్కువ నీళ్లు తాగితే లేదా వాతావరణం చల్లగా ఉన్నా ఇంకా కొన్నిసార్లు ఎక్కువగా వెళుతూ ఉంటాం. అయితే చాలామంది పదేపదే మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. ద్రవాలని అధికంగా తీసుకోవడం వల్ల అలాగే ఆల్కహాల్, కేఫిన్ శీతల పానీయాలు అధికంగా తీసుకున్న యూరిన్ కు ఎక్కువసార్లు వెళ్తూ ఉంటారు.
అయితే వీటి కారణంగానే పదేపదే యూరిన్ కి వెళ్తున్నామని అనుమానంలో చాలామంది ఉంటారు. ప్రధానంగా రాత్రి సమయంలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. దీనికి కారణంగా నిద్ర కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. మీరు యూరిన్ కి ఎక్కువసార్లు వెళుతూ ఉంటే ఈ సమస్య అయి ఉండవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అయితే ఆ సమస్య ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. కిడ్నీలో స్టోన్స్ ఉన్నా : కిడ్నీలో స్టోన్స్ ఉన్న పదేపదే యూరిన్ కి వెళ్తూ ఉంటారు. మూత్రంలో ఉండే మినరల్స్, ప్రోటీన్స్, స్పటికాలుగా మారి రాళ్లగా ఏర్పడుతూ ఉంటాయి. మూత్రశయానికి దగ్గర్లో ఉండే రాళ్ల మూలంగా తరచూ యూరిన్ కి వెళ్ళవలసి వస్తుంది.. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ : యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ మూత్రనాళాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్ దీనిలో సహజంగా కంటే ఎక్కువసార్లు యూరిన్ కి వెళ్ళవలసి రావచ్చు.
అయితే దీంతోపాటు చాలామంది యూరిన్లో మంట రక్తస్రావం రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అర్జెంటుగా మూత్ర విసర్జన చేయాలి అనిపించడం, పొత్తికడుపు నొప్పి లాంటి సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ సంకేతాలు మీకు కనిపిస్తే వెంటనే డాక్టర్ని కలిస్తే మంచిది. డయాబెటిస్ : టైప్ వన్ టైప్ టు షుగర్ కు పిక్వెంట్ యూరినేషన్ మొదట లక్షణమని వైద్యులు నిరూపించారు. డయాబెటిస్ మూలంగా బ్లడ్ లో షుగర్లు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఎక్కువగా గ్లూకోజ్ ను ఫిల్టర్ చేసేలా కిడ్నీలను ఇవి ఒత్తిడి చేస్తూ ఉంటాయి. ఇక దాంతో ఎక్కువసార్లు యూరిన్ కి వెళ్ళవలసి వస్తుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు అస్సలు అశ్రద్ధ చేయవద్దు.. మహిళలలో ఎందుకు వస్తుంది :
ఆడవారిలో పదే పదే యూరిన్ కి వెళ్లడం యు టి ఐ, ఓ ఏ బి మూత్రాస్య ఇన్ఫెక్షన్ మూలంగా వచ్చే అవకాశం ఉంటుంది. లేదా గర్భధారణ, ఫైబ్రైడ్లు, మెనూఫాజ్, అండాశయ క్యాన్సర్, ఈస్ట్రోజన్ తక్కువగా విడుదల అవుతున్న పదేపదే ముద్ర విసర్జనకు వెళ్ళవలసి ఉంటుంది. కావున ఇటువంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. పురుషులలో ఈ సమస్య ఎందుకు వస్తుంది : మగవారిలో పదేపదే యూరిన్ కి వెళ్లడం ప్రోస్టేట్ సమస్యలకు లక్షణం. ఈ సమస్య అయ్యుండవచ్చు ఇన్ఫెక్షన్స్ మూలంగా ప్రో స్టేట్, ప్రో స్టేట్ క్యాన్సర్ కారణంగా పదేపదే యూరిన్ కి వెళ్ళవలసి వస్తుంది. పొరపాటున కూడా తరచుగా ఇలా జరుగుతుంటే అస్సలు ఆలస్యం చేయవద్దు.. వెంటనే వైద్య నిపుణులు సంప్రదించాలి..