Pomegranate : దానిమ్మ పండ్లు వీరు తింటే చాలా డేంజర్.. జాగ్రత్త..!
ప్రధానాంశాలు:
Pomegranate : దానిమ్మ పండ్లు వీరు తింటే చాలా డేంజర్.. జాగ్రత్త..!
Pomegranate : పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనేది మనందరికీ తెలిసిందే. అయితే అందులోనూ దానిమ్మ పండ్లతో వచ్చే లాభాలు అంతా ఇంతా కాదు. దానిమ్మ పండ్లు ఒక రకంగా ఆరోగ్యానికి ఎన్నో ఔషధాలను అందిస్తాయి. అంతే కాకుండా ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతాయని మనందరికీతెలుసు. మరీ ముఖ్యంగా రక్తహీనతను తగ్గించడంలో దివ్య ఔషధంగా పని చేస్తాయి దానిమ్మ పండ్లు. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. ఈ పండ్లు రక్తహీనత ఉన్న ప్రతి ఒక్కరూ తినే విధంగా అయితే ఉండవని అంటున్నారు డాక్టర్లు. ఎందుకంటే అందులో కూడా కొన్ని కారణాలు ఉంటాయి.
Pomegranate : ఎండు దానిమ్మ తినొద్దు..
తక్కువ రక్తహీనత ఉన్న వారు దానిమ్మ పండ్లను అస్సలు తినొద్దు. ఎందుకంటే దానిమ్మ అంటేనే చల్లని పొండ్లు. కాబట్టి తక్కువ రక్తపోటు ఉన్న వారు తింటే మాత్రం వారిలో రక్త ప్రసరణ మందగించే ప్రమాదం కూడా ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా ఎండు దానిమ్మ తినకూడదు. దానిమ్మ తీపి పండు. ఈ విషయం తెలియక చాలామంది షుగర్ పేషెంట్లు తినడం వల్ల వారి బ్లడ్ లో షుగర్ లెవల్స్ బాగా పెరుగుతాయని డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి షుగర్ ఉన్న వారు దానిమ్మ పండ్లకు దూరంగా ఉండటమే చాలా బెటర్ అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఇక వీరితో పాటు మరొకరికి కూడా దానిమ్మ అస్సలు మంచిది కాదు. ఎలర్జీ సమస్యలు ఉన్న వారు తిన్నా సరే అలర్జీ సమస్యలు ఇంకా పెరుగుతాయని డాక్టర్లు చెబుతున్నారు. ఎందుకంటే దానిమ్మలో ఉండే కొన్ని ప్రత్యేక గుణాల వల్ల అలర్జీ సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇక దానిమ్మ జ్యూస్ ను ఖాళీ కడుపుతో తాగినా సరే అసిడిటీ సమస్యలు మరింత ఎక్కువగా అవుతాయి. అంతే కాకుండా శారీరక సమస్యలు కూడా ఎక్కువ అవుతాయని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే ఉదయాన్నే దీన్ని అస్సలు తినొద్దుపైన తెలిపిన సమస్యలు ఉన్న వారు మాత్రం అస్సలు దానిమ్మ పండ్లను తినొద్దని డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి ఒకవేళ వీరు తినాలనుకుంటే మాత్రం డాక్టర్ల సలహా మేరకు తింటే మంచిదని చెబుతున్నారు.