Coriander Tea : కొత్తిమీర టీ తాగితే ఇన్ని లాభాలా.. ఆరోగ్యం మీ చేతుల్లోనే..!
ప్రధానాంశాలు:
Coriander Tea : కొత్తిమీర టీ తాగితే ఇన్ని లాభాలా.. ఆరోగ్యం మీ చేతుల్లోనే..!
Coriander Tea : చాలా మంది ఉదయాన్నే ఏదో ఒక టీ తాగుతుంటారు. ఇండియాలో ఎక్కువ మంది టీ తాగుతుంటారు. ఇంకొందరు మాత్రం గ్రీన్ టీ, లేదా లెమన్ టీ లాంటివి తాగుతుంటారు. అయితే వీటితో పాటు మీకు ఒక ఆరోగ్యకరమైన టీ గురించి ఇప్పుడు చెప్పబోతున్నాం. అదే కొత్తిమీర టీ. ఈ టీ తాగితే కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు. కొత్తిమీరను ఎక్కువగా కూరల్లో టేస్ట్ కోసం వేస్తుంటారు. అయితే అది రుచి కోసమే కాదండోయ్ ఆరోగ్యం కోసం కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఉదయాన్నే కొత్తిమీర టీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Coriander Tea : మెదడు రీ ఫ్రెష్..
ఈ కొత్తి మీర టీలో ఎక్కువగా డైటరీ ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్ కూడా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెప్పుకోవాలి. కొత్తిమీర ఆకుల్లో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు పార్కిన్సన్స్, అల్జీమర్స్, మల్టిపుల్ స్క్లెరోసిస్‌తో సహా అనేక మెదడు వ్యాధుల నుండి కాపాడుతుందని చెప్పుకోవాలి. ఉదయానన్నే ఉడకబెట్టి టీ తయారు చేసుకుని తాగితే మెదడు చాలా ఫ్రెష్ అవుతుంది. అంతే కాకుండా దాన్ని తాగడం వల్ల మెటబాలిజం పెరిగి బరువు కూడా బాగా తగ్గుతారు. దాంతో పాటు ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కాబటట్ఇ నోటి దుర్వాసన పోతుంది.
అంతే కాకుండా జీర్ణ క్రియ ఎంతో ఆరోగ్యంగా మారుతుందని చెప్పుకోవాలి. కొత్తిమీర ఆకుల టీ తాగడం వల్ల చర్మం మెరుగుపడుతుంది. ఇందులోని పోషకాలు టాక్సిన్స్ ను తొలగిస్తుంది. అంతే కాకుండా విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది. ఇక కొత్తిమీరతో కలిగే మరో పెద్ద ప్రయోజనం ఏంటంటే దీని వల్ల మన బాడీలోని రక్తపోటు సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. అంతే కాకుండా ఇందులో కాల్షియం ఉంటుంది కాబట్టి ఎముకలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. ఎముకలకు చాలా బలం చేకూరుతుంది. అంతే కాకుండా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. ఇలా ఉదయాన్నే కొత్తిమీర టీ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి ప్రతి రోజూ ఉదయం కొత్తిమీర తాగాలని డాక్టర్లు సూచిస్తున్నారు.