Tea Coffee : వేడివేడిగా టీ మరియు కాఫీ తాగితే… ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tea Coffee : వేడివేడిగా టీ మరియు కాఫీ తాగితే… ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా…!!

 Authored By ramu | The Telugu News | Updated on :30 November 2024,9:30 am

ప్రధానాంశాలు:

  •  Tea Coffee : వేడివేడిగా టీ మరియు కాఫీ తాగితే...  ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా...!!

Tea Coffee : ప్రస్తుత కాలంలో ఉదయాన్నే టీ లేదా కాఫీ తాగనిదే అస్సలు తెల్లవారదు. అలాగే ప్రతి ఒక్కరికి ఉదయం లేవగానే టీ లేదా కాఫీ కడుపులో పడాల్సిందే. అలాగే చాలామంది అన్నం తిన్న తినకపోయినా సరే టీ తాగకపోతే మాత్రం మూడ్ అస్సలు మారదు. ఇంకొంతమంది అయితే మూడు లేక నాలుగు సార్లు కూడా టీ లేక కాఫీని తాగుతూ ఉంటారు. అది కూడా ఎంతో వేడిగా పొగలు కక్కుతూ ఉండేలా తాగుతూ ఉంటారు. అయితే ఈ టీ లేక కాఫీని వేడివేడిగా తాగితేనే కిక్కు. అందులో ఇప్పుడు చలికాలం కావున మరింత వేడితో టీ లేక కాఫీలు తాగుతూ ఉంటారు. అయితే ఈ కాఫీ మరియు టీ లను అంత వేడిగా తాగటం మంచిది కాదు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Tea Coffee వేడివేడిగా టీ మరియు కాఫీ తాగితే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా

Tea Coffee : వేడివేడిగా టీ మరియు కాఫీ తాగితే… ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా…!!

టీ లేక కాఫీని వేడివేడిగా తాగటం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి అని అంటున్నారు నిపుణులు. ఇలా వేడివేడిగా తాగితే అన్నవాహిక అనేది దెబ్బతింటుంది అని అంటున్నారు. అలాగే ఎక్కువ వేడిగా ఉండేవి కాకుండా తక్కువ వేడిగా ఉండే టీ లేక కాఫీలు తాగితే మంచిది. ఇలా వేడి టీ లను మరియు కాఫీలు తాగటం వలన జీర్ణ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. అలాగే గ్యాస్ మరియు అల్సర్లు, మంట, చికాకు లాంటి సమస్యలు కూడా వచ్చి పడతాయి. అలాగే వేడి వేడి కాఫీ మరియు టీలను తీసుకున్నట్లయితే అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది అని అంటున్నారు నిపుణులు.

అధికంగా వేడి పానీయాలను తీసుకోవడం వలన గొంతు మరియు నోరు, కడుపు పొరకు కూడా ఎంతో హాని కలుగుతుంది. అలాగే ఆడవారు కూడా వేడివేడిగా టీ మరియు కాఫీలు తాగటం వల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తాయి అని అంటున్నారు. అంతేకాక గర్భిణీలు మాత్రం వేడివేడిగా టీ ని అస్సలు తాగకూడదు. వీటితో గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చి పడతాయి

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది