Plastic Paper Cup Tea : ప్లాస్టిక్, పేపర్ కప్పుల్లో టీ తాగుతున్నారా… అయితే జబ్బులు కొని తెచ్చుకున్నట్లే…!
Plastic Paper Cup Tea : టీ అంటే ఇష్టపడిన వారు ఎవరుంటారు. మెగాస్టార్ చిరంజీవి టీ ప్రత్యేకత గురించి స్వయంగా పాట కూడా పాడారు. ఇక మార్కెట్లో రకారకాల టీలు కూడా అందుబాటులో ఉన్నాయి. వీధి వీధి కో కొట్టు దర్శనమిస్తుంది. కొన్ని రకాల టీలు ఆరోగ్యానికి హానికరమైతే.. మరికొన్ని ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. టీ ఏదైనా అది ఏ కప్పులో తాగుతున్నామన్నది కూడా చాలా ఇంపార్టెంట్.. ముఖ్యంగా పేపర్, ప్లాస్టిక్ కప్పుల్లో టీ తాగడం అతి ప్రమాదకరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే ముందుగా వారికి టీనే ఇస్తాం.. అది వారికి ఇచ్చే గౌరవంగా భావిస్తాం.. చలికాలం, వర్షాకాలం కంటే సమ్మర్లో కాస్త తగ్గించిన పూర్తిగా మాత్రం అవాయిడ్ చేయరు.. ఒకవేళ మానేద్దాం అనుకున్న వారికి ఆ సమయం వచ్చేసరికి బుర్ర పనిచేయదు. అబ్బా తల బద్దలు అవుతుంది అనుకుంటారు. ఇంట్లో వాళ్ళను కంగారు పెట్టేస్తారు.
అప్పుడు కానీ వారికి ప్రశాంతంగా ఉండదు. పనిలో అలసిపోయినా కాస్త తీరిక సమయం దొరికిన అందరి మనసు టి వైపే వెళుతుంది. ఎన్నిసార్లు తాగుతారో వారికే తెలియదు. ఇంట్లో చేసుకునే తాగే వారి పరిస్థితి వేరు ఎందుకంటే వారు ఎలాగి పేపర్ కప్పులు ఉపయోగించరు.. ఇక బయట మాత్రం ఎక్కువ శాతం పేపర్ లేదా ప్లాస్టిక్ ఇస్తారు. చచ్చినట్లు అందులోని తాగాలి. ఒకప్పుడు గాజు స్టీల్ గ్లాసులు సరిగా శుభ్రం చేయరు.. వేరే వాళ్ళు తాగేసిన దాంట్లో తాగడానికి ఇష్టపడేవారు కాదు. అందుకే మార్కెట్లోకి డిస్పోజబుల్ గ్లాసులు వచ్చాయి. ఇప్పుడు పేపర్ గ్లాసుల సహాబాల నడుస్తోంది. అయితే అవి కూడా ఆరోగ్యానికి నష్టం చేసేవి కానీ వాటి వల్ల ఎటువంటి ప్రయోజనాలు వాటి తయారీలో ఉపయోగించే కొన్ని రసాయనాలు స్వతగా ఆ మెటీరియల్ లో ఉండే కెమికల్స్ వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అందులో కెమికల్ రియాక్షన్ జరిగి అది మన శరీరంలోకి వెళ్తుంది. దాని వల్ల డయేరియా వచ్చే అవకాశం ఉంటుంది. అందులో ఉండే కెమికల్స్ కిడ్నీ పనితీరుపై ప్రభావాన్ని చూపుతాయి. కిడ్నీలు చెడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అసలు మంచిది కాదు. ఎందుకంటే అందులో ఉండే మోటరోస్కోని బిసినల్ కెమికల్స్ ఆమె ఆరోగ్యంతో పాటు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం పై ప్రభావాన్ని చూపుతాయి. పేపర్ ప్లాస్టిక్ లో టీ తాగడం వల్ల అందులో ఉండే అతి సూక్ష్మమైన టైని ప్లాస్టిక్ పార్టికల్స్ ఒంట్లోకి చేరతాయి.
దానిలో విష పదార్థాలు శరీరంలో ప్రవేశిస్తాయి. తరచుగా అలసట చెందడం జీర్ణ ప్రక్రియ వ్యవస్థ దెబ్బతినడం చిన్న పేగుల్లో ఇన్ఫెక్షన్ చర్మ సంబందిత రోగాలు ఈ పేపర్ కప్పుల వల్ల వచ్చే అవకాశం ఉంది. అందుకే పేపర్ కప్పుల్లో టీ తాగడం అనుకుంటే మంచిది. మొత్తంగా టీ మానేసిన నష్టం ఏమీ ఉండదు. అది ఆరోగ్యదాయకం. ఒకవేళ తాగాల్సి వస్తే ఈ ప్లాస్టిక్, పేపర్ కప్పులు వాడకపోవడం మంచిది. లేదంటే ఇంట్లో తయారు చేసిన టీ అయితే ఇంకా మంచిది.