Drinks : ఉదయాన్నే ఈ డ్రింక్స్ తాగితే బెల్లీ ఫ్యాట్ ఇట్టే కరుగుతుంది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Drinks : ఉదయాన్నే ఈ డ్రింక్స్ తాగితే బెల్లీ ఫ్యాట్ ఇట్టే కరుగుతుంది..!

Drinks : ఈ రోజుల్లో చాలా మంది బెల్లీ ఫ్యాట్, అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. చాలామంది ఈ బెల్లీ ఫ్యాట్ కారణంగా చాలా టెన్షన్ పడుతున్నారు. దాన్ని తగ్గించుకోవడం కోసం కొందరు అయితే మెడిసిన్ కూడా వాడుతుంటారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కొన్ని డ్రింక్స్ ను తాగడం వల్ల కూడా ఈజీగా బరువును తగ్గించుకోవచ్చు. అయితే వాటిని మాత్రం ఉదయాన్నే తాగాలని డాక్టర్లు చెబుతున్నారు. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. Drinks […]

 Authored By ramu | The Telugu News | Updated on :7 May 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Drinks : ఉదయాన్నే ఈ డ్రింక్స్ తాగితే బెల్లీ ఫ్యాట్ ఇట్టే కరుగుతుంది..!

Drinks : ఈ రోజుల్లో చాలా మంది బెల్లీ ఫ్యాట్, అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. చాలామంది ఈ బెల్లీ ఫ్యాట్ కారణంగా చాలా టెన్షన్ పడుతున్నారు. దాన్ని తగ్గించుకోవడం కోసం కొందరు అయితే మెడిసిన్ కూడా వాడుతుంటారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కొన్ని డ్రింక్స్ ను తాగడం వల్ల కూడా ఈజీగా బరువును తగ్గించుకోవచ్చు. అయితే వాటిని మాత్రం ఉదయాన్నే తాగాలని డాక్టర్లు చెబుతున్నారు. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Drinks : చియా సీడ్స్..

చియా సీడ్స్ లో బెల్లీని కరిగించే లక్షణాలు ఉన్నాయి. ఉదయాన్నే చియా సీడ్స్ డ్రింక్ ను తీసుకోవడం చాలా ఉత్తమం. చియా సీడ్స్ కాస్తా జెల్లీలా మారుతాయి. అవి నీటిని గ్రహిస్తాయి. ఇందులో ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడుతుంటాయి. వీటిని ఉదయాన్నే తాగడం వల్ల బరువు కంట్రోల్ అవుతుంది.

Drinks : కలబంద రసం..

ఉదయాన్నే కలబంద రసాన్ని తాగితే ఎంతో మంచిది. ఎందుకంటే కలబంద రసంలో చర్మం, జుట్టు ఆరోగ్యానికి సంబంధించిన లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా ఇందులో చాలా రకాల విటమిన్స్, ఖనిజాలు ఉంటాయి. వాటితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి చక్కర స్థాయిలను తగ్గించి బరువును కంట్రోల్ చుఏస్తాయి. అయితే దీన్ని ఎక్కువగా తీసుకుంటే సమస్యలు వస్తాయి.

Drinks ఉదయాన్నే ఈ డ్రింక్స్ తాగితే బెల్లీ ఫ్యాట్ ఇట్టే కరుగుతుంది

Drinks : ఉదయాన్నే ఈ డ్రింక్స్ తాగితే బెల్లీ ఫ్యాట్ ఇట్టే కరుగుతుంది..!

Drinks : నిమ్మరసం..

నిమ్మరసం చాలా ఉత్తమమైనది. ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇంకా చెప్పాలంటే రాత్రి సమయంలో దీన్ని తాగితే మాత్రం కచ్చితంగా బాడీకి మంచి శక్తి లభిస్తుంది. దాంతో పాటు ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుంది. ఫ్రీ రాడికల్స్ లో కలిగే నష్టం నుంచి కూడా కాపాడుకోవచ్చు.

Drinks : దాల్చిన చెక్క టీ..

దాల్చిన చెక్క రసంతో కూడా ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని మసాలాల్లో వాడుతుంటాం. అయితే ఉదయాన్నే దాల్చిన చెక్క టీని తాగితే మాత్రం ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించేందుకు బాగా సాయం చేస్తుంది. రక్తంలో ఉండే చెక్కర స్థాయిలను తగ్గించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది