Ginger Buttermilk : మజ్జిగలో ఇది కలుపుకుని తాగితే బెల్లీ ఫ్యాట్ ఐస్‌లా కరగాల్సిందే !
ప్రధానాంశాలు:
Ginger Buttermilk : మజ్జిగలో ఇది కలుపుకుని తాగితే బెల్లీ ఫ్యాట్ ఐస్‌లా కరగాల్సిందే !
Ginger Buttermilk : మజ్జిగ.. దాహాన్ని తీర్చడమే కాకుండా శరీర వేడిని తగ్గించి బాడీని చల్లబరుస్తుంది. అంతేకాకుండా శరీరానికి అవసరమయ్యే సోడియం, క్యాల్షియంను అందిస్తుంది. అయితే మజ్జిగను అల్లంతో కలిపి తీసుకుంటే రెట్టింపు లాభాలు పొందవచ్చని నిపుణులు వెల్లడిస్తున్నారు.
– ఒక గ్లాస్ మజ్జిగలో 1 టీస్పూన్ అల్లం రసం కలిపి కొద్దిగా జీలకర్ర పొడి, నిమ్మరసం వేసి మిక్స్ చేయాలి. చల్లగా తాగితే మరింత లాభదాయకం.
– అల్లం మజ్జిగ వేసవిలో శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి సహాయ పడుతుంది. డీహైడ్రేషన్ సమస్యలు నివారించడంలో మంచి శీతల పానీయంగా పని చేస్తుంది. మజ్జిగలో ప్రోబయాటిక్స్ ఉండటంతో జీర్ణవ్యవస్థ బలపడుతుంది. మజ్జిగను అల్లంతో కలిపి తాగితే అజీర్ణం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి.
– అల్లంలో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉండటంతో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్‌ఫెక్షన్లను నివారించడంలో ఇది సహాయ పడుతుంది. మజ్జిగ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచే మంచి సహజ పానీయం. వేసవిలో డిహైడ్రేషన్ గా ఉన్నప్పుడు ఇది తాగడం చాలా ఉత్తమం.
– అల్లంతో చేసిన మజ్జిగ పొట్టలో మంటను తగ్గిస్తుంది. గ్యాస్, గ్యాస్ట్రిక్ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. బరువు తగ్గే వారికి ఇది మంచి ఎంపిక. అలాగే అల్లం మెటబాలిజాన్ని పెంచి కొవ్వు కరిగించడంలో సహాయ పడుతుంది.
– పాలతో పోలిస్తే మజ్జిగలో కొవ్వు, కేలరీలు తక్కువగా ఉంటాయి. ప్రోటీన్, కాల్షియం ఎక్కువగా వుంటుంది. మజ్జిగలో సోడియం, పొటాషియం, భాస్వరం, విటమిన్లు తక్కువ మొత్తంలో ఉంటాయి. మిక్సర్ జార్‌లో కొద్దిగా పెరుగు వేసి, చిన్న అల్లం ముక్కను కోసి, అవసరమైనంత ఉప్పు వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక గ్లాసులోకి తీసుకుని తాగాలి.