మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసం వస్తుందా.? కారణమేమిటో తెలిస్తే షాక్ అవుతారు…!
కాస్త దూరం నడిస్తే ఆయాసం.. మెట్ల ఎక్కితే ఆయాసం.. ఎక్కువసేపు నిలబడిన ఆయాసం.. దాంతోపాటు విపరీతంగా దాహం చెమటలు పట్టడం ఇవన్నీ మనిషి బలహీనతకు సమస్యలు మాత్రమే కాకుండా గుండె సంబంధిత సమస్యలకు సూచనగా కూడా భావించవచ్చు.. ఎందుకంటే మీ గుండెకు కొంచెం శ్రమించిన సరే అది తట్టుకోలేక పోతుంది. అంటే ముఖ్యంగా మూడు విభాగాల్లో పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి హెమోగ్లోబిన్, రెండు ఊపిరితిత్తులు మూడు గుండెకు సంబంధించిన పరీక్షలు చేయించుకుంటే ఈ పరీక్షల్లో మీకు ఆయాసం ఎందుకు రెగ్యులర్ గా వస్తుందో తేలిపోతుంది. ఆయాసానికి కారణాలు.. తీసుకోవలసిన జాగ్రత్తలు పూర్తిగా తెలుసుకుందాం.. అసలు ఆయాసం ఉంది అని ఎలా గుర్తించాలి అంటే కూర్చున్న.. విశ్రాంతి తీసుకున్న ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటే గుండెకు సంబంధించిన ఆయాసం అని గుర్తించాలి.
ఇలాంటివారు ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లకిలా పడుకోకూడదు. అలాగే హఠాత్తుగా ఆయాసం ప్రారంభమైతుంది. ఇలా ఎందుకు వస్తుంది అంటే శ్వాస వ్యవస్థలో ఇబ్బందులు ఏర్పడడం వల్ల ఆయాసం వస్తుంది. గాలి పీల్చుకుని వదిలే మార్గాలు కొంచెం వీటిలో కొన్ని అడ్డంకులు ఏర్పడతాయి. ముక్కు గొంతుకకు సంబంధించిన వ్యాధులు రావడం వల్ల కొన్ని రకాల వాతావరణ వాసనలు పడకపోవడం వల్ల ఇలాంటి లక్షణాలు ఉంటే మీకు ఆయాసం ఉన్నట్టే మనలో చాలామంది వాకింగ్ చేయడం అలవాటు ఉంటుంది. అయితే ఆస్తమా ఉన్నవాళ్లు కానీ ఉబకాయంతో బాధపడే వాళ్ళుగాని కొంచెం దూరం కూడా నడవలేరు.. కారణమేంటంటే వాళ్ళు చాలా ఆయాసానికి గురవుతారు.. అయితే చాలామంది ఊబకాయం లేకపోయినా ఆస్తమా లేకపోయినా కొంచెం దూరం నడిచిన విపరీతంగా చెమటలు పట్టడం ఆయాసం రావడం మనం గమనిస్తూ ఉంటాం.
దీనివల్ల ఆందోళన కూడా పెరుగుతుంది. అయితే ఇది భయపడాల్సినంత పెద్ద సమస్య కాకపోయినా ముందుగా మనం జాగ్రత్త పడడం అనేది చాలా ఉత్తమం. మొదటిగా మీరు ఊబకాయంతో గనుక బాధపడుతుంటే మితంగా సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా బరువు నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఆహారంలో తాజా పళ్ళు అధికంగా తీసుకుంటే వాటిలోని ఆక్సిడెంట్లు గుండె ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడటం ద్వారా ఆయాసాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఆస్తమా ఉన్నవారు తక్కువగా తీసుకోవడం మంచిది. ఇక ప్రాసెస్ చేసిన పదార్థాలు అంటే ప్యాకేజీల ఫుడ్స్ ఉంటాయి కదా వాటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ పదార్థాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు సల్ఫేట్ లాంటి రక్తనాళాలు వాడుతారు. దీంతో శ్వాస సంబంధ సమస్యలు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి.
అలాగే కొవ్వు కూడా ఎక్కువగా ఉంటుంది.. కాబట్టి వీటిని కూడా దూరంగా ఉంచండి. వీటిని ఎక్కువగా తింటే బాడీలో గ్యాస్ కూడా ఫామ్ అవుతుంది. కాబట్టి వీటిని తగ్గించండి. ఏదేమైనా మీ సమస్య తీవ్రతను బట్టి డాక్టర్ని సంప్రదించిన తర్వాతే ఇటువంటి హోమ్ రెమెడీస్ మీరు వాడడం మంచిది.