Papaya : బొప్పాయి లో ఎన్ని లాభాలు ఉన్నాయో తెలిస్తే అసలు వదిలిపెట్టకుండా తింటారు..!
ప్రధానాంశాలు:
Papaya : బొప్పాయి లో ఎన్ని లాభాలు ఉన్నాయో తెలిస్తే అసలు వదిలిపెట్టకుండా తింటారు..!
Papaya : కాలానికి అనుగుణంగా పండ్లు ఉంటాయి. అందులో శీతాకాలంలో ఒక పండు Papaya మాత్రం కచ్చితంగా తినాలని పోషకాహార మరియు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి పండు ఇది అమృతంతో సమానమని చెబుతారు. ఈ పండు ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలో ముందుంటుంది. బొప్పాయి పండులో ఖనిజాలు ,విటమిన్లు ,యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. దీనితో అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు.
Papaya బొప్పాయి వల్ల కలిగే ప్రయోజనాలు
బొప్పాయి పండు లో ఉండే పాపైన్ మాంసాహారాన్ని త్వరగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. అలాగే మలబద్ధకాన్ని నివారిస్తుంది. రక్తపోటును బొప్పాయి లో ఉండే పొటాషియం నియంత్రిస్తుంది. గుండెపోటు హాట్ స్ట్రోక్, వంటి ప్రమాదాలను తగ్గిస్తుంది. ముఖ్యంగా బొప్పాయి పండులో విటమిన్ సి పుష్కలంగా లభించడంతో ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీనితో జలుబు ఫ్లూ వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. బొప్పాయి పండు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మానికి కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. బొప్పాయి పండు లో ఉండేటటువంటి యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మృదువుగా ముడతలు లేకుండా కాపాడుతుంది. మొటిమలు మచ్చలు వంటి చర్మ సమస్యలను కూడా తగ్గిస్తుంది. అయితే కొన్ని అధ్యయనాల ప్రకారం చూసుకున్నట్లయితే కొన్ని రకాల క్యాన్సర్ లు బొప్పాయి పండు లో నిరోధించే గుణాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక బొప్పాయి పండులో విటమిన్ ఏ అధికంగా ఉండడం వలన ఇది కళ్ళకు చాలా మంచిది. కంట్లో మచ్చలకు కంటిచూపు తగ్గడం వంటి సమస్యలను నివారిస్తుంది.
బొప్పాయిని తీసుకునే విధానం
బొప్పాయి పండు తొక్క మరియు గింజలను తీసేసి తినాలి. బొప్పాయి జ్యూస్ చేసుకొని కూడా తాగవచ్చు. సలాడ్లలో కూడా బొప్పాయి పండుని ఉపయోగించవచ్చు. మరి కొందరైతే బొప్పాయిని స్మూతీలలో కలుపుకొని తాగుతారు. అయితే బొప్పాయి వలన కొంతమందికి అలర్జీ ఏర్పడవచ్చు. కాబట్టి మొదటిసారి బొప్పాయి తినాలి అనుకునేవారు తక్కువ పరిమాణంలో తీసుకోవడం మంచిది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు బొప్పాయి పండును తీసుకోకపోవడం మంచిది. అయితే రోజువారి ఆహారంలో బొప్పాయి పండును చేర్చుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.