Mustard Oil : మీ ముఖంపై మచ్చలు పోవాలంటే… ఈ నూనెను ప్రయోగించండి… అందమైన మృదువైన చర్మాన్ని పొందండి…?
ప్రధానాంశాలు:
Mustard Oil : మీ ముఖంపై మచ్చలు పోవాలంటే... ఈ నూనెను ప్రయోగించండి... అందమైన మృదువైన చర్మాన్ని పొందండి...?
Mustard Oil : అమ్మమ్మల కాలం నుంచి ఆవనూనె అందరికీ తెలుసు.ఈ అవనూనె ప్రయోజనాలు అమోఘం. దీనితో బోలెడ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఆవనూనెను ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా గొప్ప ప్రయోజనాన్ని అందిస్తుంది అంటున్నారు పోషకాహార నిపుణులు.దీని నుంచి వచ్చే వాసన కారణంగా వంటకు వాడాలంటే చాలామంది ఇష్టపడరు.ఇది అంటుకుంటే త్వరగా పోదు. దీని ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు. తీరంలో దీనిని కేవలం అవయవాలకు మాత్రమే ఉపయోగించడం కాదు, బయట కనిపించే చర్మం,జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తుంది. నూనె వాడకం వల్ల ఎన్నో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.మరి అవేంటో తెలుసుకుందాం…

Mustard Oil : మీ ముఖంపై మచ్చలు పోవాలంటే… ఈ నూనెను ప్రయోగించండి… అందమైన మృదువైన చర్మాన్ని పొందండి…?
Mustard Oil ఆవనూనె చర్మానికి ఇంకా,దీని ఆరోగ్య ప్రయోజనాలు
ఈ నూనె వంటకు మంచి రుచిని ఇవ్వడమే కాదు, తరచూ ఉపయోగిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందంటున్నారు నిపుణులు.ఇది వర్షాకాలంలో, చలికాలంలో, జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి కాపాడుతుంది. ఇంకా,వీటినుంచి ఉపశమనాన్ని కూడా అందిస్తుంది. ఈ నూనె ఆస్తమా లక్షణాలు తగ్గించడానికి సహకరిస్తుంది.ఆస్తమాతో ఇబ్బంది పడే వారికి డైట్లో ఆవాలు ఆవనూనె తీసుకుంటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆవనూనెలో ఉండే ఒమేగా -3,6 ఫ్యాటీ యాసిడ్స్,చెడు కొలెస్ట్రాలను నివారిస్తుంది. తరచు వంటల్లో వినియోగిస్తే, గుండె సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు.ఇంకా, యాంటీ బ్యాక్టీరియా,యాంటిఫంగల్ లక్షణాలు కూడా ఉంటాయి. హానికరమైన ఇన్ఫెక్షన్ల నుంచి జీర్ణ వ్యవస్థను కాపాడుతుంది.
కండరాలు,కీళ్ల నొప్పుల నుంచి ఆవనూనె ఉపశమనాన్ని ఇస్తుంది. వాపు,నొప్పి ఉన్నచోట ఆవనూనెతో మర్దన చేస్తే సమస్య తగ్గుతుంది. ఇంకా, శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుంది.ఆవనూనె వాడకంలో రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రిస్తుంది.డయాబెటిస్ ఉన్నవారు దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఆవ నూనెలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉంటాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. అంతే కాదు,రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఆవనూనె దంత సమస్యలను నయం చేస్తుంది. నోటి శుభ్రతను మెరుగుపరుస్తుంది. దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. పూర్వకాలంలో చిన్నపిల్లలకు ఇన్ఫెక్షన్లు రాకుండా ఆవనూన్లతో మర్దన్ చేసేవారు. జలుబు చేస్తే ముక్కు, చెవుల్లో ఆవనూనె చుక్కలను వేసేవారు.
ఆవనూనెను తలకు రాసుకోవడం వల్ల కుదుళ్ళు బలంగా తయారవుతాయి.కేశాల సంరక్షణకు బాధపడుతుంది. ఆవనూనె చర్మానికి కూడా మేలు చేస్తుంది.చర్మం లోని ఇన్ఫలమేటరీ గుణాలతో,ఎగ్జిమా వంటి చర్మ సమస్యలతో పోరాడుతుంది. ఆవనూనెలో చర్మానికి అవసరమైన ఫ్యాటీ ఆమ్లాలు విటమిన్లు ఖనిజాలు ఉంటాయి. దినితో చర్మం బాగా తేమగాను మృదువుగా సున్నితంగా తయారవుతుంది. ప్రసవానంతరం ఏర్పడే స్ట్రెచ్ మార్క్స్ పోవడానికి ఆవనూనెలో కొద్దిగా, ఆలివ్ నూనె కలిపి రాసుకుంటే ఫలితం ఉంటుంది.