Hair Tips : పలుచగా అయిన మీ జుట్టు.. ఒత్తుగా పెరగాలంటే ఈ చిట్కాను ట్రై చేయండి..
Hair Tips : చాలామందిలో జుట్టు బాగా ఊడిపోయి, ఒత్తుగా ఉన్న జుట్టు పల్చగా అవుతూ ఉంటుంది. ఈ వర్షాకాలంలో జుట్టు రాలే సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే ఈ సమస్యలకు జాగ్రత్తలు తీసుకోకపోతే మీ జుట్టు పూర్తిగా ఊడిపోయే అవకాశం ఉంది. అయితే ఇలాంటి సమస్యలు, వచ్చినప్పుడు కొన్ని రకాల ఆయిల్స్ ను, షాంపులను వాడుతుంటారు. కానీ వాటి వలన ఎలాంటి ఉపయోగం ఉండదు. అయితే దీనికి మనం ఇంట్లోనే న్యాచురల్ గా ఒక సీరం ను రెడీ చేసుకుని, ఉపయోగించుకున్నట్లయితే, ఉడిన జుట్టు మళ్లీ తిరిగి వస్తుంది.
దీని తయారీ విధానం: రైసు, మందార పూలు, విటమిన్ ఈ క్యాప్సిల్స్, ఆరు ఏడు మందార పూలను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ ను ఒక గ్లాస్ తీసుకొని దాన్లో నాలుగు గ్లాసుల నీళ్లు పోసుకుని, దాన్లో మందారపు ముక్కలను వేసి, స్టవ్ మీద పెట్టి 10, 15 నిమిషాలు మాత్రమే ఉడికించుకోవాలి. తరువాత స్టవ్ మీద నుంచి దింపేసి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. తర్వాత వడకట్టుకుని ఒక గాజు సీసాలో పోసేముందు, దీనిలో రెండు విటమిన్ ఈ క్యాప్సిల్స్ ను వేయాలి. వేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిని గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. ఇది రెండు మూడు, రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది. ఈ సీరంమును వారంలో రెండు మూడు సార్లు పెట్టుకోవచ్చు. దీనిని జుట్టుకి బాగా అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకున్న తర్వాత ,30 మినిట్స్ వరకు ఆగి తర్వాత, కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి.
ఇలా తయారు చేసుకుంటూ, 30 రోజులు వాడటం వలన ,ఉడిన మీ జుట్టు తిరిగి వస్తుంది. ఈ సీరం వాడడం వల్ల 90% రిజల్ట్ ఉంటుంది. ఈ సిరంలో అమైన్ ఆసిడ్స్ ఉంటుంది. ఇది బట్టతలకు బాగా ఉపయోగపడుతుంది. ఈ సిరం వడకట్టిన తర్వాత మిగిలిపోయిన మిశ్రమంను తీసుకొని మిక్సీ పట్టుకొని, దానిని జుట్టుకి ప్యాక్ లాగా వేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వలన చాలా ఉపయోగం ఉంటుంది ఈ ప్యాక్ వలన చుండ్రు, తెల్ల జుట్టుకు, జుట్టు రాలిపోవడం, లాంటి సమస్యలు అన్ని తగ్గిపోతాయి. మీ జుట్టు ఒత్తుగా, నల్లగా ,సిల్కీగా పొడవుగా, పెరుగుతుంది. ఈ సీరంను, పిల్లల దగ్గర నుంచి ముసలి వారి వరకు అలాగే మగవారు కూడా వాడుకోవచ్చు.