Heart Attack : వేరే దేశాల మనుషులతో పోల్చితే.. వాళ్లకంటే 10 ఏళ్ల ముందే ఇండియా వాసులకు హార్ట్ ఎటాక్ వస్తుందట?
Heart Attack : గుండెపోటు.. ప్రస్తుతం ఈ వ్యాధి చాప కింద నీరులా విస్తరిస్తోంది. నిజానికి కొన్నేళ్ల కింద.. గుండె పోటు అనేది కేవలం వయసు మీదపడిన వాళ్లకే వచ్చేది. గుండెకు సంబంధించిన వ్యాధులన్నీ అంతే. 60 నుంచి 70 ఏళ్లు దాటిన వాళ్లలో మాత్రమే కనిపించేవి. కానీ.. జనరేషన్ మారింది.. అసలు వయసుతో పని లేకుండా గుండె సంబంధిత వ్యాధులు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి.
చిన్న పిల్లల దగ్గర్నుంచి.. యుక్త వయసులో ఉన్న వాళ్లకు, ముసలివాళ్లకు అందరికీ హార్ట్ ఎటాక్ అనేది కామన్ అయిపోయింది. నేటి జనరేషన్ లైఫ్ స్టయిల్ ఇటువంటి వ్యాధులకు ప్రధాన కారణం. అందుకే నేటి జనరేషన్ వయసుతో పనిలేకుండా హార్ట్ ఎటాక్స్ తెచ్చుకుంటోంది. చిన్న వయసులోనే గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతోంది.
ఒక రీసెర్చ్ ప్రకారం.. పాశ్చాత్య దేశాల కన్నా.. భారత దేశంలో.. భారత ప్రజలకు 10 ఏళ్ల ముందే గుండె జబ్బులు వస్తున్నాయట. అంటే.. వేరే దేశానికి చెందిన ఒక వ్యక్తికి 40 ఏళ్లకు గుండె పోటు వస్తే.. అదే వ్యక్తి ఇండియాలో ఉంటే 30 ఏళ్లకే గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంది. అంటే.. గుండెకు సంబంధించిన సమస్యల్లో వేరే దేశాలతో పోల్చితే మనం 10 ఏళ్లు ముందే ఉన్నాం. చిన్న వయసులోనే భారతదేశ ప్రజలకు హార్ట్ కు సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.
Heart Attack : గుండెనొప్పికి గల ప్రధాన కారణాలు
సాధారణంగా వారంలో కనీసం 5 రోజులైనా మనిషికి వ్యాయామం కంపల్సరీ. రోజుకు ఓ అరగంటైనా నడవాలి. కానీ.. నేటి జనరేషన్ లో నడక అనేది లేదు. బయట అడుగు పెడితే చాలు.. వాహనాలను ఉపయోగించడమే. అంతెందుకు.. పక్కనే ఉన్న కిరాణ షాపుకు వెళ్లి సరుకులు తేవాలన్నా.. పాల ప్యాకెట్ తేవాలన్నా బైక్, కారు తీసే పరిస్థితి. నాలుగు అడుగులు వేయలేని పరిస్థితి.
శరీరానికి ఎటువంటి అలసట లేకుండా.. కనీసం ఓ అరగంట కూడా నడవకుండా ఉండటం వల్ల అతి త్వరగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.
ఉద్యోగాలు చేసేవాళ్లు అయితే ఉదయం నుంచి సాయంత్రం దాకా అలాగే కూర్చొని సిస్టమ్స్ ముందు పనిచేస్తారు. అది చాలా ప్రమాదకరం. గంటకు కనీసం 10 నిమిషాలు కూర్చున్న ప్లేస్ నుంచి లేచి కాస్త అటూ ఇటూ తిరిగి మళ్లీ పని ప్రారంభించాలి. కానీ.. అలాగే మూడు నాలుగు గంటలు కూర్చొని పని చేయడం వల్ల గుండెకు సంబంధించిన ఎన్నో సమస్యలు దరిచేరే ప్రమాదం ఉంది.
వారానికి ఒక్క రోజు కూడా వ్యాయామం చేయకుండా ఉండటం, బయటి ఫుడ్ తినడం, అధికంగా కొవ్వు ఉండే పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం, కూర్చొని ఎక్కువసేపు పనిచేయడం, నడవకపోవడం, ప్రతి చిన్న పనికి సొంత వాహనాల మీదనే ఆధారపడటం లాంటి వాటి వల్ల ఎక్కువగా గుండెనొప్పులను తెచ్చుకుంటున్నారు.