Tomato : చీప్ గా దొరికావే… కానీ ఆరోగ్యానికి చాలా మెండు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tomato : చీప్ గా దొరికావే… కానీ ఆరోగ్యానికి చాలా మెండు…!

 Authored By ramu | The Telugu News | Updated on :11 June 2024,11:30 am

ప్రధానాంశాలు:

  •  Tomato : చీప్ గా దొరికావే... కానీ ఆరోగ్యానికి చాలా మెండు...!

Tomato : ప్రస్తుత కాలంలో చెడు ఆహారపు అలవాట్ల వలన ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాము. ఈ సమస్యలు ఒకటి అధిక రక్తపోటు కూడా. ఈ ఆధునిక కాలంలో చాలామంది అధిక రక్తపోటు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో పాటు, గుండె సమస్యలకు కూడా ప్రధాన కారణం అధిక రక్తపోటు. నిజానికి ఎక్కువ సోడియం తీసుకోవడం వలన అధిక రక్తపోటు సమస్య అనేది వస్తుంది. కానీ పొటాషియం ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవటం వలన అధిక రక్తపోటుతో పోరాడొచ్చు. టమటాలో పొటాషియం అనేది అధికంగా ఉంటుంది. ఇది బీపీని తగ్గించడంలో కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు,లైకోపిన్ కూడా గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది…

నిజానికి టమాటా. ప్రతి ఒక్కరి వంట గదిలో ఉండేటటువంటి సాధారణ వెజిటేబుల్. ఈ వెజిటేబుల్ ఎరుపు మరియు పసుపు రంగులో కూడా ఉంటుంది. టమాటాలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అనేవి దాగి ఉన్నాయి. ఈ టమాటాల్లో విటమిన్లు, పోషకాలు, పొటాషియం, విటమిన్ సి, ఫోలేట్,యాంటీ ఆక్సిడెంట్, కె, అధికంగా ఉన్నాయి. అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు కూడా టమాటాలు అనేవి వరం లాంటివి అని వైద్య నిపుణులు తెలిపారు. ఇంకా టమాటా అనేది ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నుండి కూడా మనల్ని రక్షిస్తుంది. అంతేకాక ఈ టమాటా అనేది చర్మానికి ఎంతో ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది…

Tomato : క్యాన్సర్ ను నివారిస్తుంది

మన ఆహారంలో ఈ టమాటాలు తీసుకోవడం వలన ఆహారం అనేది రుచిగా ఉండటమే కాక క్యాన్సర్ తో కూడా పోరాడుతుంది. ఈ టమాటాలు అనేవి క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. దీనిలో లైక్ ఫిన్ లో క్యాప్సినో జెనిక్ అనే గుణాలు ఉన్నాయి. ఇది కడుపుకు సంబంధించిన కాలేయ క్యాన్సర్ ను కూడా నియంత్రిస్తుంది.

Tomato చీప్ గా దొరికావే కానీ ఆరోగ్యానికి చాలా మెండు

Tomato : చీప్ గా దొరికావే… కానీ ఆరోగ్యానికి చాలా మెండు…!

Tomato : కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది

టమాటాలో ఆరోగ్యకరమైన ఖనిజాలు అనేవి ఉన్నాయి. దీనిలో ఫైబర్, కొలీన్, విటమిన్ సి, పొటాషియం కారణం వలన గుండెకు కూడా మంచిది. లైక్ ఫిన్ అనేది మన శరీరం నుండి చెడు కొలెస్ట్రాల్ ను కూడా నియంత్రిస్తుంది. ఇంకా బీపీ ని కూడా నియంత్రిస్తుంది…

Tomato : చర్మ ఆరోగ్యం కోసం

టమాటాలను చర్మ ఆరోగ్యం కోసం కూడా మన ఆహారంలో చేర్చుకోవచ్చు. దీని వలన ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. అంతేకాక టమాటా రసాన్ని ముఖానికి అప్లై చేస్తే ముఖం ఎంతో కాతివంతంగా మెరుస్తుంది. ముఖంపై ఉన్న రంధ్రాలను కూడా నియంత్రించటంలో ఎంతో ప్రభావంతంగా పని చేస్తుంది…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది