Biting Your Nails : గోళ్లు కొరుకుతున్నారా…అయితే మీరు డేంజర్ జోన్ లో ఉన్నట్లే…
Biting Your Nails : సాధారణంగా చాలామంది చిన్నప్పటి నుంచి గోళ్లు కొరకడం అలవాటు ఉంటుంది. అదే అలవాటు పెద్దవారు అయ్యేదాకా కొనసాగుతుంది. ఎందుకు ఈ అలవాటు వస్తుందంటే…దేని గురించైనా బాగా ఆలోచించినప్పుడు లేదా ఏ విషయంలోనైనా కంగారుగా ఉన్నప్పుడు వాళ్లకు తెలియకుండానే గోళ్లు కొరుకుతుంటారు. అయితే ఇలా గోళ్లు కొరుక్కోవడం అనేది అస్సలు మంచిది కాదని వైద్య శాస్త్ర నిపుణులు అంటున్నారు. పదే పదే గోళ్లు కొరికితే గోళ్లలోని మట్టి నోట్లోకి చేరి అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు అంటున్నారు. అలాగే గోళ్లకు, పళ్లకు నష్టం కలుగుతుందని అంటున్నారు.
మన శరీరంలో కాల్షియం లోపం వలన గోళ్లు కొరకడం అలవాటవుతుంది. అలాంటప్పుడు కాల్షియం ఎక్కువగా దొరికే పదార్ధాలను తీసుకోవాలి. పాలలో కాల్షియం ఎక్కువగా వుంటుంది కాబట్టి రోజు పాలను తాగాలి. అలాగే ఏదో ఒక పని చేస్తూ వుండాలి. అలా చేయటం వలన గోళ్లు కొరకాలనే ఆలోచన ఉండదు. అలాగే గోళ్లు కొరకాలనే అలవాటును మానుకోవాలని గట్టిగా నిశ్చయించుకోండి. ఏదైనా విషయం గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఎక్కువగా కంగారు పడకుండా ధైర్యంగా ఉండండి. ప్రతి చిన్న విషయానికి కంగారు పడుతూ గోళ్లు కొరుక్కోకండి. ఒత్తిడి తగ్గాలంటే యోగా, ధ్యానం వంటివి చేయడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వలన గోళ్లు కొరికే అలవాటును సులువుగా మానుకోవచ్చు.

Life style biting your nails these is the bad habit
గోళ్లను కొరికే అలవాటు నుంచి బయటపడాలంటే ముందుగా గోళ్లను పొట్టిగా కత్తిరించుకోవాలి. గోళ్లను పొట్టిగా కత్తిరిస్తే కొరకాడానికి వీలు కాదు. దీనివలన గోళ్లు కొరికే అలవాటు నుంచి సులువుగా బయటపడొచ్చు. అందుకే గోళ్లను ఎప్పటికప్పుడు పొట్టిగా కత్తిరించుకోవాలి.గోళ్లని నోట్లో పెట్టుకోవడం వలన వేళ్లకు ఉండే మురికి అంతా నోట్లోకి చేరి వివిధ రకాల రోగాల బారిన పడుతాం. చిన్నపిల్లలకు గోళ్లు కొరకడం మంచిది కాదని తెలియజేయండి. వాళ్లు వినకపోతే గోళ్లను పొట్టిగా కత్తిరించేయాలి. లేకపోతే వేళ్లకు వేప, కాకర రసం వంటివి రాయాలి. అప్పుడు వేళ్లను నోట్లో పెట్టుకోవడానికి ప్రయత్నించరు.