Mangosteen Fruit : ఈ పండు ప్రయోజనాలు తెలిస్తే వెంటనే ఇంటికి తెచ్చుకుంటారు.. స్పెషల్ ఫ్రూట్ గురించి ఈ డీటైల్స్ తెలుసా..?
Mangosteen Fruit : మనం జనరల్ గా బయటకు వెళ్లి ఫ్రూట్స్ తెచ్చుకుంటే రెగ్యులర్ గా అరటి, జామ, ద్రాక్ష, ఆరెంజ్, యాపిల్ ఇలా వీటినే తరచు తెచ్చుకుంటాం. వీటిని తింటే మంచిదే కానీ వీటి తో పాటు అప్పుడప్పుడు వేరే పండ్లని ట్రై చేస్తుంటే వాటి నుంచి వచ్చే పోషకాలు అన్ని అందుతాయి. ఇక ఈరోజు ఆంగోస్టీన్ ఫ్రూట్ గురించి తెలుసుకుందాం. చాలా తక్కువమందికి తెలిసే ఈ పండు వల్ల చాలా లాభాలు ఉన్నాయి. తీపి, […]
ప్రధానాంశాలు:
Mangosteen Fruit : ఈ పండు ప్రయోజనాలు తెలిస్తే వెంటనే ఇంటికి తెచ్చుకుంటారు.. స్పెషల్ ఫ్రూట్ గురించి ఈ డీటైల్స్ తెలుసా..?
Mangosteen Fruit : మనం జనరల్ గా బయటకు వెళ్లి ఫ్రూట్స్ తెచ్చుకుంటే రెగ్యులర్ గా అరటి, జామ, ద్రాక్ష, ఆరెంజ్, యాపిల్ ఇలా వీటినే తరచు తెచ్చుకుంటాం. వీటిని తింటే మంచిదే కానీ వీటి తో పాటు అప్పుడప్పుడు వేరే పండ్లని ట్రై చేస్తుంటే వాటి నుంచి వచ్చే పోషకాలు అన్ని అందుతాయి. ఇక ఈరోజు ఆంగోస్టీన్ ఫ్రూట్ గురించి తెలుసుకుందాం. చాలా తక్కువమందికి తెలిసే ఈ పండు వల్ల చాలా లాభాలు ఉన్నాయి. తీపి, పులుపు కలిసి ఉండే ఈ మాంగోస్టీన్ పండు వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. మాంగోస్టీన్ పండ్లలో ఉన్న యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాల వల్ల కడుపులో మంటని తగ్గిస్తాయి. క్యాన్సర్, గుండెజబ్బులు, మధుమేహం లాంటి సమస్యలను కూడా ఈ పండు తినడం వల్ల దూరం చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మాంగోస్టీన్ పండ్లలో విటమిస్ సి ఉంటుంది. దీని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో యాంటీ ఆస్కిడెంట్స్ వ్యాధుల బారిన పడకుండా చేస్తుంది.
Mangosteen Fruit ఇందులోని ఫైబర్ కంటెంట్..
మాంగోస్టీన్ ఫ్రూట్ వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇందులోని ఫైబర్ కంటెంట్ చెడు కొలెట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రీల్ పెరిగేలా చేస్తుంది. మాంగోస్టీన్ లో ఉన్న ఫైబర్ వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి లాభం చేకూరుస్తుంది.
మాంగోస్టీన్ ఫ్రూట్ చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఈ పండ్ల వల్ల యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఏజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ పండ్లు డయాబెటిస్ పేషెంట్స్ కు బాగా ఉపయోగపడుతుందిఉ. రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుంది. ఫైబర్ కంటెంట్ కూడా మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఉపయోగకరంగా ఉంటుంది.