Money Plant : మనీ ప్లాంట్ మొక్క వేపుగా పెరగాలంటే… ఇలా చేయండి…??
Money Plant : ప్రస్తుత కాలంలో ఎవరి ఇంట్లోనైనా ఈజీగా కనిపించే మొక్కలలో మనీ ప్లాంట్ ఒకటి అని చెప్పొచ్చు. అయితే ఈ మనీ ప్లాంట్ ను ఇంట్లో పెంచుకోవడం వల్ల మంచి జరుగుతుంది అని మరియు ఆర్థిక సమస్యలు తీరతాయి అని ఈ మొక్కను పెంచుకుంటూ ఉంటారు. అయితే ఈ మొక్క ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు ఎంతో మేలు చేస్తుంది అని దీనిని ఎక్కువగా పెంచుతారు. అంతేకాక మనీ ప్లాంట్ అనేది ఆక్సిజన్ ను […]
ప్రధానాంశాలు:
Money Plant : మనీ ప్లాంట్ మొక్క వేపుగా పెరగాలంటే... ఇలా చేయండి...??
Money Plant : ప్రస్తుత కాలంలో ఎవరి ఇంట్లోనైనా ఈజీగా కనిపించే మొక్కలలో మనీ ప్లాంట్ ఒకటి అని చెప్పొచ్చు. అయితే ఈ మనీ ప్లాంట్ ను ఇంట్లో పెంచుకోవడం వల్ల మంచి జరుగుతుంది అని మరియు ఆర్థిక సమస్యలు తీరతాయి అని ఈ మొక్కను పెంచుకుంటూ ఉంటారు. అయితే ఈ మొక్క ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు ఎంతో మేలు చేస్తుంది అని దీనిని ఎక్కువగా పెంచుతారు. అంతేకాక మనీ ప్లాంట్ అనేది ఆక్సిజన్ ను రిలీజ్ చేసి కార్బన్ డైయాక్సైడ్ ను పీల్చుకుంటుంది. కావున ఇంట్లో ఈ మొక్క ఉంటే గాలి అనేది కలుషితం కాకుండా ఉంటుంది అని ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు. అయితే కొందరి ఇంట్లో ఈ మొక్క అనేది అంతగా పెరగదు…
అలాంటి టైంలో ఇప్పుడు మేము చెప్పే చిట్కాలు పాటించండి. ఇది ఇండోర్ మొక్క అయినప్పటికీ కూడా ఎదుగుదల అనేది లేకపోతే సూర్యరశ్మి తగిలే చోట ఉంచండి. అయితే ఈ మొక్కకు రోజుకు ఒకటేసారి నీళ్లు అనేవి పోయకుండా ప్రతిరోజు కొన్ని కొన్ని నీళ్లను పోస్తూ ఉండండి. అలాగే ఈ మనీ ప్లాంట్ కి ఎరువు కూడా వేయవచ్చు. దీనికోసం ఇంట్లో మనం కడిగిన బియ్యం నీళ్లు మరియు మాసం కడిగిన నీళ్లు, ఉల్లిగడ్డ తొక్కలు, పండ్ల తొక్కలను ఎరువుగా చేసి దీనికి ఇవ్వచ్చు…
అలాగే మీరు ఇతర మొక్కలను ఎలాంటి పర్టి లైజర్స్ వాడతారో అవే ఈ మొక్కకు కూడా ఇవ్వొచ్చు. అంతేకాక ఈ మనీ ప్లాంట్ కి పాలు పోసిన కూడా అది ఎంతో చక్కగా పెరుగుతుంది. అలాగే మనీ ప్లాంట్ మొక్కకు పసుపు కలిపిన నీళ్లు కూడా పోయవచ్చు. అలాగే మజ్జిగ లాంటి పోషకాలను వారానికి ఒక్కసారైనా ఇస్తూ ఉంటే మనీ ప్లాంట్ లో మంచి గ్రోత్ అనేది మీకు కనిపిస్తుంది. మీరు గనక ఇలా చేస్తే మనీ ప్లాంట్ మొక్క లో గ్రోత్ అనేది తొందరగా వస్తుంది