Nutmeg : జాజికాయలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో… ఈ సమస్యలన్నీ పరార్… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nutmeg : జాజికాయలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో… ఈ సమస్యలన్నీ పరార్…

 Authored By ramu | The Telugu News | Updated on :20 June 2024,10:00 am

Nutmeg : జాజికాయ అనేది కేవలం సుగంధ ద్రవ్యాలలో భాగమైనది మాత్రమే కాక, దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. జాజికాయ ఫైబర్ కు ఎంతో అద్భుతమైన మూలం అని చెప్పొచ్చు.దీనిలో ఐరన్,ఫాస్ఫరస్, జింక్, మాంగనీస్,కాపర్,విటమిన్ సి, విటమిన్ ఎ,విటమిన్ ఇ మరియు మెగ్నీషియం శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలను అందిస్తుంది. జాజికాయను ఆయుర్వేదంలో కీళ్లనొప్పి మరియు కండరాల నొప్పి,పుండ్ల కు సంబంధించి చికిత్సలో కూడా దివ్య ఔషధంగా కూడా పని చేస్తుంది. ప్రస్తుత కాలంలో ఊరుకుల పరుగుల జీవితంలో, మనకు ఉన్నటువంటి ఒత్తిడిని తగ్గించటంలో కూడా ఈ జాజికాయ ఎంతో బాగా పని చేస్తుంది. రాత్రి నిద్ర పోయేముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఈ జాజికాయ పొడి వేసుకొని తాగితే ప్రశాంతంగా మరియు తొందరగా కూడా నిద్ర అనేది వస్తుంది. జాజికాయ అనేది మేధస్సుకు పదును పెట్టటమే కాక మీ కళ్ళకు కూడా ఎంతో పదును పెడుతుంది. జాజికాయ పొడిని పేస్ట్ లాగా చేసుకుని కనురెప్పలు మరియు కళ్ళ చుట్టూ అప్లై చేసుకుంటే కంటి చూపు కూడా ఎంతో మెరుగుపడుతుంది. అంతేకాక జాజికాయను ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే మతిమరుపు సమస్య ను దూరం చేస్తుంది…

ఈ జాజికాయ మెదడులోని నరాలను కూడా ఎంతో ఉత్తేజ పరుస్తుంది. నిరాశ మరియు ఆందోళనను నియంత్రించడానికి కూడా ఇది ఎంతో సహాయం చేస్తుంది. జాజికాయలో సెరోటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని కూడా ఎంతగానో పెంచుతుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ ఫంగల్ లక్షణాలు మొటిమలను తగ్గించటంలో కూడా ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. దీనిలో ఉన్నటువంటి సమ్మేళనం చర్మానికి మెరుపును తీసుకు వచ్చేందుకు ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. ఈ జాజికాయలో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి అధికంగా ఉంటాయి. ఈ జాజికాయ క్యాన్సర్ నియంత్రించడంలో కూడా ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. ఈ జాజికాయతో పెద్ద ప్రేగు క్యాన్సర్ ను కూడా తగ్గించవచ్చు అని పరిశోధకులు తెలిపారు. అంతేకాక ఇది కీళ్ల నొప్పులను మరియు కండరాల నొప్పులను కూడా నియంత్రించడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది.

Nutmeg జాజికాయలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో ఈ సమస్యలన్నీ పరార్

Nutmeg : జాజికాయలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో… ఈ సమస్యలన్నీ పరార్…

మన ప్రస్తుత కాలంలో అనారోగ్యకరమైన జీవన శైలి,చెడు ఆహారం అనేవి అవయవాలలో ఎంతో విషాన్ని నిప్పుతున్నాయి. అయితే జాజికాయ శరీరంలో టాక్సిన్స్ ను నియంత్రించడానికి కూడా సహాయం చేస్తుంది. అంతేకాక కాలేయం మరియు మూత్రపిండాల నుండి కూడా విషాన్ని తొలగిస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వలన నోటి దుర్వాసనకు కారణం అయ్యే బ్యాక్టీరియాను కూడా నియంత్రించడానికి ఇది ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది