Nutmeg Powder : జాజికాయ పొడిలో ఉన్న లాభాలు తెలిస్తే… అస్సలు వదిలిపెట్టరు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Nutmeg Powder : జాజికాయ పొడిలో ఉన్న లాభాలు తెలిస్తే… అస్సలు వదిలిపెట్టరు…!!

Nutmeg Powder : జాజికాయ అనగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది బిర్యాని. అయితే పులావ్ దినుసులలో ఉండే వాటిలలో ఇది కూడా ఒకటి. ఈ జాజికాయ గురించి అందరికీ తెలిసినదే. అలాగే దీనిలో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. అలాగే దీనిలో యాంటీబయోటిక్ మరియు యాంటీ ధర్మోబోటిక్, పొటాషియం, ఐరన్, జింక్, మెగ్నీషియం ,కాల్షియం, కాపర్ లాంటివి కూడా సమృద్ధిగా ఉంటాయి. ఈ పొడిని కొద్దిగా తీసుకున్న సరే ఇన్ని పోషకాలు అందుతాయి. అలాగే […]

 Authored By ramu | The Telugu News | Updated on :6 October 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Nutmeg Powder : జాజికాయ పొడిలో ఉన్న లాభాలు తెలిస్తే... అస్సలు వదిలిపెట్టరు...!!

Nutmeg Powder : జాజికాయ అనగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది బిర్యాని. అయితే పులావ్ దినుసులలో ఉండే వాటిలలో ఇది కూడా ఒకటి. ఈ జాజికాయ గురించి అందరికీ తెలిసినదే. అలాగే దీనిలో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. అలాగే దీనిలో యాంటీబయోటిక్ మరియు యాంటీ ధర్మోబోటిక్, పొటాషియం, ఐరన్, జింక్, మెగ్నీషియం ,కాల్షియం, కాపర్ లాంటివి కూడా సమృద్ధిగా ఉంటాయి. ఈ పొడిని కొద్దిగా తీసుకున్న సరే ఇన్ని పోషకాలు అందుతాయి. అలాగే ఈ జాజికాయను ఆయుర్వేదంలో ఎన్నో రకాల వ్యాధులను నయం చేయటంలో కూడా ఉపయోగిస్తారు. ఈ తరుణంలోనే జాజికాయ పొడిని వాడడం వలన ఆరోగ్యపరంగా ఎన్నో రకాల అద్భుతాలు ఉన్నాయి. అలాగే చర్మం మరియు జుట్టు సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. అయితే ఈ జాజికాయలో ఉండే లాభాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

నిద్రలేమి : నిద్రలేమి సమస్యతో బాధపడేవారు జాజికాయ పొడిని తీసుకోవటం వలన ఈ సమస్య నుండి ఈజీగా బయటపడవచ్చు. ప్రస్తుత కాలంలో మనం ఉన్న బిజీ లైఫ్ కారణం చేత ఒత్తిడి మరియు ఆందోళన అనేది ఎక్కువై నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నాము. అయితే నిద్రలేమి కారణం చేత ఇన్సోమియ లాంటి వ్యాధులు వచ్చి పడతాయి. అయితే మీరు రాత్రి పడుకునే ముందు పాలలో చిటికెడు జాజికాయ పొడిని వేసుకొని తాగితే ఈ సమస్య నుండి మీరు తొందరగా బయటపడతారు…

పంటి నొప్పి : పంటి నొప్పి సమస్యతో బాధపడే వారికి కూడా ఈ జాజికాయ పొడి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఈ జాజికాయ పొడి తో నోటి దుర్వాసన అనేది దూరమై ఆరోగ్యం అనేది పెరుగుతుంది. అయితే దీనిలో భయటో యాక్టివ్ యుగనైట్ ఉండడం వలన పంటి ఆరోగ్యం మరియు నోటికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి…

స్కిన్ కేర్ : చర్మ సమస్యలతో బాధపడే వారికి కూడా జాజికాయ మంచి హోమ్ రెమిడి అని చెప్పొచ్చు. దీనిలో యాంటీ ఇన్ఫ్లమెంటరీ మరియు యాంటీ మైక్రో బ్యాక్టీరియల్ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి. అలాగే స్కిన్ పై వచ్చే దురద మరియు మంటను కూడా తగ్గిస్తాయి. అలాగే ఈ జాజికాయ పొడి యక్నె ని తగ్గించటంలో కూడా ఎంతో బాగా పనిచేస్తుంది. అంతేకాక మచ్చలు మరియు గీతాలు కూడా తగ్గుతాయి.

Nutmeg Powder జాజికాయ పొడిలో ఉన్న లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు

Nutmeg Powder : జాజికాయ పొడిలో ఉన్న లాభాలు తెలిస్తే… అస్సలు వదిలిపెట్టరు…!!

గుండె ఆరోగ్యం : ఈ జాజికాయలో పొటాషియం మరియు కాల్షియం, మెగ్నీషియం కూడా ఉన్నాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని రక్షించడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కావున గుండె సమస్యలతో బాధపడే వారు కూడా ఈ జాజికాయ పొడిని తీసుకోవచ్చు.

డిప్రెషన్ : ఒత్తిడి మరియు ఆందోళన, డిప్రెషన్ తో ఇబ్బంది పడే వారు కూడా ఈ జాజికాయ పొడిని తీసుకోవటం వలన మంచి ఫలితం ఉంటుంది. అలాగే డిప్రెషన్ ఉన్న టైంలో మీరు కోరి వెచ్చని నీటిలో ఈ పొడిని కలుపుకొని తాగితే ఈ సమస్య నుండి ఈజీగా బయటపడొచ్చు…

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది