Hair Tips : వారం రోజుల్లో మీ జుట్టును పొడవుగా, బలంగా తయారు చేసే అద్భుతమైన చిట్కా..!
Hair Tips : ఈ మధ్య కాలంలో చాలా మంది జుట్టురాలే సమస్యతో బాధపడుతున్నారు. అలాగే జుట్టు త్వరగా తెల్ల బడటం, చిట్లిపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు, తీసుకునే ఆహారం వల్ల ప్రతీ ఒక్కరికీ చాలా మంది జుట్టు ఆరోగ్యం పాడవుతోంది. అయితే వీటిని తగ్గించుకునేందుకు వందల రూపాయలను ఖర్చు చేస్తూ… రకరకాల షాంపూలు, నూనెను, హెయిర్ డైలను వాడుతుంటారు. కానీ వల్ల అప్పటికప్పుడు ఫలితం కనిపించినప్పటికీ… సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగా […]
Hair Tips : ఈ మధ్య కాలంలో చాలా మంది జుట్టురాలే సమస్యతో బాధపడుతున్నారు. అలాగే జుట్టు త్వరగా తెల్ల బడటం, చిట్లిపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు, తీసుకునే ఆహారం వల్ల ప్రతీ ఒక్కరికీ చాలా మంది జుట్టు ఆరోగ్యం పాడవుతోంది. అయితే వీటిని తగ్గించుకునేందుకు వందల రూపాయలను ఖర్చు చేస్తూ… రకరకాల షాంపూలు, నూనెను, హెయిర్ డైలను వాడుతుంటారు. కానీ వల్ల అప్పటికప్పుడు ఫలితం కనిపించినప్పటికీ… సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే వాటిని వాడడం తగ్గించి జుట్టును ఆరోగ్యంగా ఉంచుకునేందుకు వంటింటి చిట్కాలను మాత్రమే వాడాల్సి ఉంటుంది. అయితే ఇంట్లోనే సులువుగా తయారు చేసుకునే ఈ నూనె వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.
అలాగే జుట్టు ఒత్తుగా, నల్లగా, బలంగా తయారవుతుంది. అయితే ఆ నూనె ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా 4 పెద్ద కలబంద మట్టలను తీస్కొని శుభ్రంగా కడిగి అంచులను కట్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు నీళ్లు వేయకూడదు. కావాలంటే కొంచెం కొబ్బరి నూనె వేసుకోవచ్చు. దళసరిగా ఉన్న కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఆ తర్వాత కలబంద మిశ్రమాన్ని కడాయిలో వేసుకొని దీనిలో పావు కిలో కొబ్బరి నూనె పోసుకోవాలి. నూనెను కలుపుకుంటూ మరిగించుకోవాలి. తర్వాత మూడు చెంచాల మెంతులు వేస్కొని ఒక గుప్పెడు తాజా మందార ఆకులను కూడా వేసుకోవాలి.
చిన్న మంట పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. కలబంద మిశ్రమం నుంచి బయటకు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఆకులు కలబంద మిశ్రమం మొత్తం నల్లగా మారి నూనె బటకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నూనెను వడ కట్టుకోవాలి. ఈ నూనె ప్రతి రోజూ తలకు రాసుకోవడం వల్ల జుట్ట రాలే సమస్య తగ్గుతుంది. అంతే కాకుండా జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. అలాగే మృదువుగా, నల్లగా మారుతుంది. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు ఈ నూనెను తలకు మర్దనా చేసుకోవాలి. చిరాకుగా ఉంది అనుకున్న వాళ్లు ఉదయమే తల స్నానం చేయాలి. ఇలా ఈ నూనెను రోజూ వాడటం వల్ల మరెన్నో ప్రయాజనాలు ఉన్నాయి. ఈ నూనె వల్ల తలనొప్పి నుంచి కూడా వమిక్తి లభిస్తుంది.