Health Tips : అలాంటి వారు పసుపు తినొద్దు.. తింటే సమస్యలు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Tips : అలాంటి వారు పసుపు తినొద్దు.. తింటే సమస్యలు…

Health Tips : మన దేశంలో సంప్రదాయ వంటకాల్లో పసుపు వినియోగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వంటింట్లో ఏ వంటకం చేసినా.. అందులో దాదాపుగా పసుపు పడాల్సిందే అప్పుడే ఆ వంటికానికి రుచి వస్తుంది. దానిని తిన్న వారికి ఆరోగ్యం చేకూరుతుంది. పసుపును అనేక ఆయుర్వేద మందుల్లో వాడుతుంటారు. ఇందులో కాల్షియం, సోడియం వంటివి ఎక్కువగా ఉండటం వల్ల ఇవి శరీరానికి మేలు చేస్తాయి. ఇందులో కుర్కుమిన్ మూలకం ఉంటుంది. ఇది హెల్త్ ప్రాబ్లమ్స్ […]

 Authored By mallesh | The Telugu News | Updated on :9 January 2022,6:00 am

Health Tips : మన దేశంలో సంప్రదాయ వంటకాల్లో పసుపు వినియోగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వంటింట్లో ఏ వంటకం చేసినా.. అందులో దాదాపుగా పసుపు పడాల్సిందే అప్పుడే ఆ వంటికానికి రుచి వస్తుంది. దానిని తిన్న వారికి ఆరోగ్యం చేకూరుతుంది. పసుపును అనేక ఆయుర్వేద మందుల్లో వాడుతుంటారు. ఇందులో కాల్షియం, సోడియం వంటివి ఎక్కువగా ఉండటం వల్ల ఇవి శరీరానికి మేలు చేస్తాయి. ఇందులో కుర్కుమిన్ మూలకం ఉంటుంది. ఇది హెల్త్ ప్రాబ్లమ్స్ ను తగ్గించి ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో కీ రోల్ పోషిస్తుంది. మనిషికి పసుపు ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుంది.

కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు పసుపును తీసుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.చాలా మంది కిడ్నీల్లో, బాడీలో నిఇతర భాగాల్లో రాళ్ల సమస్యతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు పసుపును ఎక్కువగా తీసుకోకపోవడమే మంచింది. కేవలం డాక్టర్ సజిషన్ తీసుకున్న తర్వాతే తినాలా లేదా అనేది డిసైడ్ అవ్వాలి. వీరు పసుపు ఎక్కువగా సమస్య మరింత ఎక్కువయ్యే ప్రమాదముంటుంది. మధుమేహం ఉన్న వారు సైతం పసుపును లిమిట్ గా తీసుకోవాలి. డయాబెటిస్ ఉన్న వారు.. రక్తంలో చక్కెర ను నియంత్రించేందుకు రక్తం పలుచగా మారే మందును వాడుతుంటారు.

people with health problems should not eat turmeric

people with health problems should not eat turmeric

Health Tips : సమస్యలు తప్పవు

అలాంటి వారు పసుపును ఎక్కువగా తీసుకుంటే బాడీలో బ్లడ్ లెవల్ తగ్గిపోతుంది. దీని వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. రక్తం కడ్డకట్టే ప్రక్రియ నెమ్మదిగా జరిగేలా చేస్తుంది పసుపు. కొందరికి ముక్కు, తదితర భాగాల నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అలాంటి వారు వీలైనంత తక్కువగానే పసుపును వాడాలి. కామెర్ల ప్రాబ్లమ్ ఉన్నవారు సైతం పసుపును అవైడ్ చేయాలి. దాని నుంచి కోలుకున్నాకు డాక్టర్ సజిషన్ తీసుకుని పసుపును తినాలి. ఇక ఎలాంటి సమస్యలు లేని వారు రోజుకు సుమారు 1 టీ స్ఫూన్ నుంచి 3 టీ స్ఫూన్‌ల వరకు పసుపును తీసుకోవచ్చు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది